వెబ్‌సిరీస్‌ల హవా హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి వచ్చింది. అది త్వరగానే సౌత్‌కి కూడా పాకింది. మారే కాలానికి అనుగుణంగా సోషల్‌మీడియాతో పాటు విస్తృతమవుతున్న టెక్నాలజీకి తగ్గట్లు మారడంలో తప్పులేదు. ఆ మద్య వరకు బుల్లితెరపై వెండితెర నటులు కనిపించడానికి సందేహించారు. కానీ బాలీవుడ్‌లో అమితాబ్, సల్మాన్, అమీర్‌ఖాన్‌లు చూపించిన చొరవతో తెలుగులో నాగార్జున, చిరంజీవి, రానా, జూనియర్ ఎన్టీఆర్‌లు కూడా బుల్లితెర కార్యక్రమాలను హోస్ట్ చేయడానికి ముందుకొస్తున్నారు. తమిళంలో కమల్ నుంచి ఆర్య వరకు అదే దారిలో ఉన్నారు.
ఇక ఇప్పుడు వెబ్‌సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్ మీద కూడా మన వారి కన్ను పడింది. ఎందరో షార్ట్‌ఫిల్మ్ డైరెక్టర్స్, నటీనటులు వెండితెరపై రాణిస్తున్నారు. దాంతో పూరీ జగన్నాథ్ కూడా 'హగ్' అనే షార్ట్‌ఫిల్మ్‌తో రానున్నాడు. ఇక 'కడప' అనే వెబ్‌సిరీస్‌తో పాటు భవిష్యత్తులో సినిమాలుగా చేయలేని కథలను తాను వెబ్‌సిరీస్ ద్వారా తీస్తానని వర్మ ప్రకటించాడు. ఇక నిన్నటివరకు ఫేడవుట్ అవుతున్న నటీనటులే వెబ్‌సిరీస్‌లలో కనిపించే వారు. ఇక వెబ్‌సిరీస్‌లతో పాటు బుల్లితెరపై కూడా నవదీప్, తేజస్వి మదివాడ వంటి యంగ్ నటులు కూడా నటిస్తున్నారు. తాజాగా రానా ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నాడు. మరోవైపు త్వరలో వెంకటేష్ కూడా వెబ్‌సిరీస్‌లో కనిపించనున్నాడు.
ఇక కొత్తదనానికి, మారుతున్న కాలానికి ఈజీగా అప్‌డేట్ అయిపోయి, టాలెంట్ ఎక్కడ ఉన్నా ఆదరించే నాగార్జున సైతం ఓ వెబ్‌సిరీస్‌లో నటించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సినిమాల నిర్మాణం నుంచి బుల్లితెరకి వచ్చిన మంచు లక్ష్మి ఈ సారి వెబ్‌సిరిస్‌ని రూపొందించనుంది. దీనికి సినీ నటుడు, టాలెంటెడ్ దర్శకుడు శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించనున్నాడు. మరో వైపు నాగ్ హీరోగా, నిర్మాతగా కూడా బిజీగా ఉన్నాడు. ఈ వెబ్‌సిరీస్ కాన్సెప్ట్‌ని తాజాగా మంచు లక్ష్మి, శ్రీనివాస్ అవసరాలలు నాగ్‌కి చెప్పారట. గతంలోనే శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగార్జున ఓ చిత్రంలో నటించనున్నాడని వార్తలు వచ్చిన నేపధ్యంలో ఈ వార్త ఆసక్తికరంగా మారింది. నాగ్ బిజీ వల్ల నో అంటే మాత్రం దానిలో ఆయన మేనల్లుడు సుమంత్‌ని తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరి నాగ్ ఓకే అంటాడో లేదో వేచిచూడాల్సివుంది..!