తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు.. తమిళ్ ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరే. వెంకటప్రభు, ఎస్పీబాలసుబ్రహ్మణ్యం కుమారుడు చరణ్‌లు ఒక టీంగా ఉంటారు. పలు చిత్రాలు చేశారు. ఇక వెంకటప్రభు తీసిన 'గోవా, సరోజ, గాంబ్లర్, రాక్షసుడు' వంటి చిత్రాల ద్వారా దర్శకుడిగా తెలుగువారికి సుపరిచితుడే. ఇక ఈయన తాజాగా తన 'చెన్నై-600028' చిత్రానికి సీక్వెల్‌గా 'చెన్నై- 600028' పార్ట్2ని చిత్రీకరించాడు. మొదటి భాగం తెలుగులో 'కొడితే కొట్టాలిరా'గా అనువాదమైంది. ఇక ఈ సెకండ్ పార్ట్‌లో మనీషా యాదవ్ నటించింది. ఈమె సుమంత్ అశ్విన్ హీరోగా వచ్చిన 'తూనీగ.. తూనీగ' చిత్రంతో తెలుగు వారికి పరిచయం.
ఇక ఈ 'చెన్నై' చిత్రం సెకండ్‌పార్ట్‌లో మనీషా యాదవ్ పూర్త్తిగా అందాలను ఆరబోసి, స్వప్న సుందరి పాత్రలో నటించడమే కాదు.. ఓ ఐటం సాంగ్‌లో రెచ్చిపోయింది. ఇక ఈమె పాత్ర చెప్పే డైలాగులు కూడా పూర్తిగా డబుల్ మీనింగ్‌లతో ఉండటంతో ఆమెపై విమర్శలు తీవ్రంగా వచ్చాయి. దానికి మనీషా యాదవ్ సమాధానం ఇస్తూ.. ఇందులో నేను చేసిన ఐటం సాంగ్ చిత్రానికి ఎంతో కీలకమైనదని, తన పాత్ర సినిమాలో కీరోల్ అని చెప్పి దర్శకుడు వెంకట్‌ప్రభు తనని మోసం చేశాడని ఆరోపించింది. అయినా ఐటం సాంగ్ సినిమాకి ఎలా కీలకం అవుతుంది? ఇక డైలాగ్స్‌లో కూడా బూతులు చెప్పినప్పుడు మనీషా యాదవ్‌కి అర్ధం కాలేదా? అన్నదే ప్రశ్న. ఇక ఈమె ఆమద్య వివాహం చేసుకుని, మరలా రీఎంట్రీ ఇచ్చి, అన్ని చిత్రాలలో శృంగార సన్నివేశాలలో రెచ్చిపోయి నటిస్తుండటం గమనార్హం.