Advertisementt

హైదరాబాద్ పై ఈ కుర్ర హీరో కామెంట్స్ చూశారా!

Sat 30th Dec 2017 08:48 PM
raj tarun,hyderabad,weather,coffee,comments  హైదరాబాద్ పై ఈ కుర్ర హీరో కామెంట్స్ చూశారా!
Raj Tarun Comments on Hyderabad Weather హైదరాబాద్ పై ఈ కుర్ర హీరో కామెంట్స్ చూశారా!
Advertisement
Ads by CJ

సినీ ఫీల్డ్‌లోకి దర్శకుడిగా కావాలని వచ్చి హీరోగా మారాడు యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌. ఇక ఆయన తన మొదటి చిత్రం 'ఉయ్యాల జంపాల', 'సినిమా చూపిస్తా మావా, కుమారి 21ఎఫ్‌, ఈడో రకం.. ఆడో రకం' వంటి హిట్‌ చిత్రాలలో నటించాడు. కానీ ఈమధ్యన  ఆయన చేసిన 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు' చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక చూడటానికి మన పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్‌తరుణ్‌ ప్రస్తుతం 'రాజుగాడు' యమడేంజర్‌ చిత్రంలో చేస్తున్నాడు. మరో వైపు దిల్‌రాజు నిర్మాణంలో 'లవర్‌' అనే చిత్రంలో నటిస్తున్నాడు. రాజ్‌తరుణ్‌ మొదటి నుంచి సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ ఉంటాడు. సమయం చిక్కినప్పుడల్లా ట్విట్టర్‌లో తన అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంటాడు. 

తాజాగా ఆయన హైదరాబాద్‌ వాతావరణంపై ఓ ట్వీట్‌ చేశాడు. హైదరాబాద్‌ వాతావరణం మంచి కాఫీలా ఉంటుంది. ఒక్కోసారి వెచ్చగా, మరి కొన్ని సార్లు చల్లగా ఉంటుందని చెప్పాడు. ఇక ఓ అభిమాని 'ఏం భయ్యా.. బాగా బిజీనా' అని ప్రశ్నిస్తే 'యస్‌.. బ్రో' అని సమాధానం ఇచ్చాడు. నెక్ట్స్‌ సినిమా ఎప్పుడు భయ్యా అని ఓ అభిమాని అడిగితే 'చిన్న సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనుకుంటున్నాను.. చాలా త్వరలోనే చెబుతా' అంటూ స్పందించాడు. ఇక ఈయనకు ఇప్పుడు అర్జంట్‌గా హిట్స్‌ కావాలి. నాని, శర్వానంద్‌, విజయ్‌దేవరకొండ వంటి పలువురు ఈయనకు గట్టి పోటీ ఇస్తున్నారు... సో.. త్వరలో ఏదో పెద్ద ప్రాజెక్టే అనౌన్స్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Raj Tarun Comments on Hyderabad Weather:

Hyderabad Weather is Like a Coffee, says Raj Tarun

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ