Advertisementt

మంచు లక్ష్మి కోసం నాగ్ ఒప్పుకుంటాడా?

Sat 30th Dec 2017 07:04 PM
web series,nagarjuna,manchu lakshmi,tollywood  మంచు లక్ష్మి కోసం నాగ్ ఒప్పుకుంటాడా?
Nagarjuna in Manchu Lakshmi's Web Series మంచు లక్ష్మి కోసం నాగ్ ఒప్పుకుంటాడా?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం సినిమాలకన్నా ఎక్కువగా వెబ్ సీరీస్ హావా నడుస్తుంది అంటే అతిశయోక్తి లేదేమో అన్నట్టుగా వుంది ఇప్పుడు ఇండస్ట్రీ వాతావరణం. బాలీవుడ్ లోనే కాదు ఇప్పుడు దక్షిణాదిన కూడా ఈ వెబ్ సిరీస్ లు హల్చల్ చేస్తున్నాయి. కేవలం సినిమాలే కాదు ఈ కాలంలో వెబ్ సీరీస్ కి కూడా ఓటేస్తున్నారు స్టార్స్. మంచి కాన్సెప్ట్ ఉంటే చాలు వాటికి గంటాపదంగా ఓటేస్తున్నారు. సినిమాల్లో అవకాశాలు లేని నటీనటులు మొదలెట్టిన ఈ వెబ్ సీరీస్ కల్చర్ కి ఇప్పుడు స్టార్ హీరోలు కూడా ఓకె చెప్పేస్తున్నారు.

సినిమాల్లోనే తమ నట విశ్వరూపం చూపించడంతో పాటు ఈ వెబ్ సీరియస్ లో తమ టాలెంట్ ని ఇంకా ఎక్కువగా చూపించడానికి ఇష్టపడుతున్నారు స్టార్స్ . నిన్నటివరకు నవదీప్ - తేజస్విని వంటి వారు మాత్రమే ఈ వెబ్ సీరీస్ తో అలరిస్తే ఇప్పుడు కొత్తగా రానా వంటి వారు కూడా ఈ వెబ్ సీరీస్ లో పాలు పంచుకుంటున్నారు. మరి రానాతో పాటే.. సీనియర్ హీరో వెంకటేష్ కూడా స్మాల్ స్క్రీన్ మీద ఈ వెబ్ సీరియస్ తో అలరించనున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. 

అయితే ఇప్పుడు మరో సీనియర్ హీరో నాగార్జున కూడా ఈ వెబ్ సీరీస్ తో కొత్తగా కనబడబోతున్నాడట. అది కూడా మంచు లక్ష్మి ఆద్వర్యంలోని శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ లో అనే న్యూస్ బాగా వినబడుతుంది. ఇప్పటికే మంచు లక్ష్మి ఆ ప్రయత్నాల్లో ఉందంట. మరి కొత్త ప్రయోగాలకు ఎప్పుడు ముందుండే నాగ్ ఈ వెబ్ సీరీస్ లో నటిస్తాడంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడూ కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో నాగ్ ముందుంటాడనే విషయం తెలిసిందే. మరి నిజంగానే ఈ వెబ్ సీరీస్ కి నాగ్ ఓకే చెప్పేశాడనే టాక్ మాత్రం హైలెట్ అయ్యింది.

Nagarjuna in Manchu Lakshmi's Web Series:

Web Series Trend in Tollywood

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ