సౌత్ హీరోయిన్స్ దక్షిణాదిన ఒక వెలుగు వెలుగుతున్న కూడా వారికి బాలీవుడ్ అంటేనే మోజెక్కువ ఉంటుంది. అందుకే బాలీవుడ్ లో అవకాశం రాగానే అక్కడికి చెక్కేస్తారు. అక్కడ గనక హిట్ అయితే సౌత్ ని చిన్న చూపు చూస్తూ చులకనగా మాట్లాడుతుంటారు. ఈ కోవకి చాలామంది హీరోయిన్స్ వస్తారు. అక్కడ గనక నిలదొక్కుకోలేకపోతే కొంతమంది హీరోయిన్ మళ్ళీ సౌత్ కి వచ్చేస్తారు. ఇక సౌత్ లో సినిమాలు చేస్తూ బాలీవుడ్ మీద ఒక కన్నేసే ఉంచుతారు. అవకాశం రాకపోతుందా.. మళ్ళీ సక్సెస్ అవ్వకపోతామా అనుకుంటూనే ఇక్కడ సినిమా చేస్తారు.
ఇలియానా వంటి వాళ్ళు బాలీవుడ్ ని వదలక అంటిపెట్టుకుంటే... కాజల్, తమన్నా వంటి వాళ్లకు అక్కడ సక్సెస్ అవ్వకపోయేసరికి మళ్ళీ సౌత్ కి వచ్చేసి ఇక్కడే సెటిల్ అయ్యారు. అయినా అప్పుడప్పుడు బాలీవుడ్ ఫంక్షన్స్ లో మెరుస్తూనే.... అవకాశాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం తెలుగులో మంచి అవకాశాలతో దూసుకుపోతున్న కాజల్ అగర్వాల్ కూడా బాలీవుడ్ లో లక్కు పరీక్షించుకుని వర్కౌట్ అవ్వక మళ్ళీ దక్షిణాదిన సెటిల్ అయ్యింది.
ఇటు తెలుగు అటు తమిళంలో లోను వరుస అవకాశాలతో దూసుకుపోతున్న కాజల్ ని మీడియా వాళ్ళు మళ్ళీ బాలీవుడ్ కి ఎప్పుడు వెళుతున్నారు అని అడగగానే.. బాలీవుడ్ కి ఎందుకండీ ఇక్కడ సౌత్ లోను నాకు బాగానే ఉంది. సౌత్ లో మంచి మంచి అవకాశాలు చేతిలో ఉన్నప్పుడు బాలీవుడ్ గురించిన ఆలోచనలు ఎందుకండీ అంటూ దిమ్మతిరిగే సమాధానం చెప్పింది. మరి అమ్మడుకి ఇక బాలీవుడ్ కి వెళ్లే ఉద్దేశ్యం లేదేమో?