Advertisementt

శర్వానంద్ ఆ సినిమా చేయడం లేదా?

Fri 29th Dec 2017 01:21 PM
sharwanand,sudheer varma,movie,stopped,doubts  శర్వానంద్ ఆ సినిమా చేయడం లేదా?
Doubts on Sharwanand and Sudheer Varma Movie శర్వానంద్ ఆ సినిమా చేయడం లేదా?
Advertisement
Ads by CJ

వరుస విజయాలు సాధిస్తూ తన కెరీర్ లో ముందుకి దూసుకుపోతున్న శర్వానంద్.. మారుతీ దర్శకత్వంలో వచ్చిన మహానుభావుడుతో హిట్ అందుకున్న తర్వాత సుధీర్ వర్మ దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయిన ఈ సినిమా ఇక సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి అని అనుకుంటున్న సమయంలో సడెన్ గా ఫిలింనగర్ లో ఈ సినిమాకి సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే శర్వానంద్, సుధీర్ వర్మల సినిమా ఆగిపోయిందని.

అయితే సుధీర్ వర్మతో సినిమా చేయాలని ఎప్పుడో ఫిక్స్ అయిన శర్వానంద్ అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. అయితే వీరిద్దరూ కలిసి సినిమా చేద్దామని అనుకున్నారు కానీ కథ పక్కాగా రాకపోవడంతో... ఇప్పుడు ఈ సినిమా నుండి శర్వానంద్ డ్రాప్ అయ్యాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక సుధీర్ వర్మ కూడా నిఖిల్ తో చేసిన కేశవ సినిమా యావరేజ్ అయ్యింది. కొంతమంది డిస్ట్రిబ్యూటర్ లకు కేశవా సినిమా నష్టాలని మిగిల్చింది. దానికి తోడు శర్వానంద్ తో చేయాలనుకున్న సినిమాకు కథ సెట్ కాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ నుండి శర్వానంద్ తప్పుకున్నాడట. మరి మూవీ ఆగిపోవడానికి అసలు కారణం ఏంటి అనేది బయటకి రాలేదు.

అందులోను శర్వానంద్ హను రాఘవపూడితో మరో సినిమాకి కమిట్ అయ్యాడు. ఇటు సుధీర్ వర్మ సినిమాని అటు హను సినిమాని ఒకేసారి చెయ్యాలనుకున్న శర్వానంద్ ఇప్పుడు సుధీర్ వర్మ సినిమా నుండి డ్రాప్ అయ్యి... హను సినిమా కంటిన్యూ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే శర్వానంద్ ఇంకా కోవెలమూడి ప్రకాష్ తో ఒక సోషియో ఫాంటసి లవ్ స్టొరీ చేద్దాం అనుకున్నాడు కాని అది కూడా షూటింగ్ స్టార్ట్ చేసుకోకముందే ఆగిపోయిందనే టాక్ వుంది.

Doubts on Sharwanand and Sudheer Varma Movie:

Sharwanand and Sudheer Varma Movie Stopped

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ