అఖిల్ నటించిన హలో సినిమా గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిట్ టాక్ తెచ్చుకుని థియేటర్స్ లో సందడి చేస్తున్న హలో సినిమా తర్వాత.... అఖిల్ నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తాడు. ఏ డైరెక్టర్ తో కలిసి పని చేస్తాడనే హాట్ హాట్ చర్చలు ఫిలింనగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి . ఇప్పటికే అఖిల్ సుకుమార్ దర్శకత్వంలో అయినా.. లేకుంటే కొరటాల దర్శకత్వంలో అయినా పనిచేస్తాడనే టాక్ సోషల్ మీడియాలో నడుస్తుంది. మరి అఖిల్ ఫైనల్ గా ఏ డైరెక్టర్ చేతిలో పడతాడో గాని... ఇప్పుడు మాత్రం అఖిల్ మూడో డైరెక్టర్ ఎవరనే దాని మీద డీప్ డిస్కర్షన్స్ జరుగుతున్నాయి.
అయితే ఇప్పుడు ఆ డైరెక్టర్స్ సరసన మరో డైరెక్టర్ వంశి పైడిపల్లి వచ్చి చేరాడు. నాగార్జునకి ఊపిరి వంటి సక్సెస్ నిచ్చిన వంశి ప్రస్తుతం మహేష్ బాబు తో ఒక మూవీ చేయనున్నాడు. ఆ తరువాత అఖిల్ ని వంశి డైరెక్ట్ చేస్తాడంటున్నారు. కానీ అఖిల్ మాత్రం తన నెక్స్ట్ డైరెక్టర్ కొరటాల కానీ, సుకుమార్ కానీ, వంశి పైడిపల్లి కానీ కాదంటున్నాడు. కాకపోతే.. వంశీ పైడిపల్లిని అఖిల్ కలవడం... వారిద్దరూ చర్చలు జరపడం నిజమేనని అంటున్నాడు అఖిల్. కానీ కథ గురించి కాదని. అలాగే ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదని క్లారిటీ ఇచ్చాడు.
అలాగే అఖిల్, కొరటాలని కలవడమే కాదు లంచ్ కూడా చేశాడట ఆయనతో. కానీ వారి మధ్యన సినిమా మాత్రం ఫైనల్ కాలేదట. మరోపక్క సుకుమార్ తోనూ మీటింగ్ పెట్టానని... కానీ తమ మధ్యన అప్పుడే సినిమా ఉండదని చెబుతున్నాడు ఈ అక్కినేని కుర్రోడు. అసలు వారితో సినిమా చెయ్యాలని వాళ్ళని కలవలేదట. అసలు తన నెక్స్ట్ సినిమా ఏమిటనేది జనవరి 10 న ఒక క్లారిటీ ఇవ్వడమే కాదు.. ఆసినిమా ఏ డైరెక్షన్ లో, ఏ నిర్మాణంలో చేయబోతున్నాడనే క్లారిటీ కూడా ఇస్తాడట అఖిల్. మరి ఈలోపు మరెంతమంది దర్శకులు అఖిల్ మూడో సినిమా లిస్ట్ లోకి వచ్చి చేరుతారో చూద్దాం.