తెలుగు అమ్మాయి అయిన అంజలి తెలుగులో అనుకున్నంత సక్సెస్ కాకపోయినా పొరుగు రాష్ట్రం తమిళ్ లో మాత్రం ఎక్కువ సక్సెస్ అయ్యి అక్కడ మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అసలు తెలుగులో అవకాశాలు తక్కువైనప్పటికీ.. తెలుగులో కూడా అంజలికి మంచి క్రేజ్ ఉంది. కొన్ని తెలుగు సినిమాల్లో అడపాదడపా మెరుస్తూనే ఉంది.
అయితే ఈ మధ్యనే తన మీద వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. తన బాయ్ ఫ్రెండ్ జై ని తానూ పెళ్లి చేసుకోబోడం లేదని.. జై కేవలం తనకి మంచి ఫ్రెండ్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చేసింది. ఇకపోతే అంజలి తాజాగా తమిళంలో నటించిన సినిమా బెలూన్ ఈ నెల 29న రిలీజ్ కి రెడీ అవుతుంది. అదే టైటిల్ తో తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అయితే బెలూన్ ప్రమోషన్స్ లో భాగంగా అంజలి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.
హీరోయిన్ గా పదేళ్లు గడిచిపోయింది. మరో పదేళ్లు హీరోయిన్ గానే కొనసాగుతా అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పింది. అంటే ఏ క్యారెక్టర్స్ వచ్చినా చెయ్యను. కేవలం హీరోయిన్ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తాను అంటూ ఇన్ డైరెక్ట్ గా కామెంట్ చేసింది అంజలి. ఫుల్ లెంగ్త్ హారర్ మూవీగా తెరకెక్కిన బెలూన్ సినిమా తనకి మంచి హిట్ ఇస్తుందనే ధీమాతో ఉంది అంజలి.