ప్రస్తుతం అందరి చూపు 'అజ్ఞాతవాసి'పైనే ఉంది. పవన్‌కి 25వ చిత్రం కావడం, పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడం, ఈ చిత్రం తర్వాత పవన్ బహుశా రాజకీయాలలో పూర్తిగా నిమగ్నమయ్యే అవకాశం ఉండటంతో వచ్చే ఎన్నికల లోపు పవన్ చేసే చివరి చిత్రం ఇదేనని కూడా టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పటికే అనిరుద్ సంగీతం అందించిన పాటలకు, ఆడియో వేడుకకు, టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ఇక ఈచిత్రం ట్రైలర్‌ని అందరూ క్రిస్మస్ సందర్భంగా ఈనెల 25వ తేదీన విడుదల చేస్తారని భావించారు. కానీ అది వాయిదా పడింది. ఇక న్యూఇయర్ సందర్భంగా ఈ చిత్రంలో పవన్ స్వయంగా పాడిన పాటని రిలీజ్ చేయనున్నారు.
జనవరి 1నే బన్నీ 'నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా' స్పెషల్ ఇంపాక్ట్ రానుండటంతో 'అజ్ఞాతవాసి' ట్రైలర్‌ని సినిమా విడుదలకు వారం ముందు అంటే 3,4 వ తేదీలలో విడుదల చేసే అవకాశం ఉంది. ఇక ఫస్ట్‌కాపీ రెడీ అయి క్యూబ్ వారికి అప్‌లోడ్ చేస్తున్నారు. 29వ తేదీన సెన్సార్‌కి పంపనున్నారు. ఇక ఈ చిత్రం షోలు ఒకరోజు ముందుగానే ఓవర్‌సీస్‌తో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా జనవరి9 రాత్రి నుంచే ప్రారంభిస్తారని సమాచారం.
ఇక ఇందులో కీర్తిసురేష్ పవన్‌కి మరదలుగా నటిస్తోంది. ఆమె పాత్రకు ఆమే సొంతగా డబ్బింగ్ చెప్పుకుంది. మరి అనుఇమ్మాన్యుయేల్ మరో మరదలిగా 'అత్తారింటికి దారేది' టైప్‌లోనే కనిపిస్తుందా? లేక ఆమెది వేరే పాత్రా అనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఇక ఈ చిత్రంలో కీర్తిసురేష్ ఇప్పటివరకు చెప్పని విధంగా ఎంతో హాస్యం పుట్టించే డైలాగ్స్ చెప్పనుందని, పవన్ కాంబినేషన్‌లో ఆమె సీన్స్ కడుపుబ్బ నవ్విస్తాయని అంటున్నారు. మరి పరాయిభాషా హీరోయిన్ హాస్యచతురత చూపించే పాత్రను చేయడమంటే కత్తి మీద సామే. మరి ఆమె చేసే కామెడీ ఎలా పండుతుందో వేచిచూడాల్సివుంది...!