Advertisementt

సమంత రతీదేవి అంట..!

Wed 27th Dec 2017 04:56 PM
samantha,rathidevi,abhimanyudu,samantha role  సమంత రతీదేవి అంట..!
Samantha As Rathi Devi సమంత రతీదేవి అంట..!
Advertisement
Ads by CJ

నాగ చైతన్యతో పెళ్లికి ముందు సమంత కమిట్ అయిన సినిమాలు కోలీవుడ్ లో విజయ్ తో నటించిన మెర్సెల్ విడుదలై హిట్ అయ్యింది. అలాగే తెలుగులో కమిట్ అయిన రంగస్థలం, మహానటి సినిమాలు మార్చి 30 న విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే నాగ చైతన్యతో పెళ్లి తర్వాత సమంత ఓకే చేసిన సినిమా అభిమన్యుడు. తమిళ్ లో ఇంకా తెలుగులో మంచి స్టార్‌డమ్‌ ఉన్న విశాల్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అయితే మొదటిసారి విశాల్ సరసన సమంత నటిస్తుండటంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. 

అయితే ఈ సినిమాలో సమంత రతిదేవి అనే సైకాలజి ప్రొఫెసర్ గా నటిస్తుంది. మరి ఇప్పటికే సమంత విజయ్ మెర్సల్ సినిమాలో రిపోర్టర్ గా  నటించింది. ఇకపోతే సమంతతో పాటు యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఈ మూవీలో ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. విశాల్ తన సొంత బ్యానర్ అయిన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పై ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని పి.ఎస్.మిత్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా.... జోర్జ్ సి విలియమ్స్ కెమెరా వర్క్ ని అందిస్తున్నారు. 

ఇక పెళ్లి తర్వాత కూడా మంచి హిట్స్ తో దూసుకుపోతున్న సమంత తో విశాల్ డిటెక్టివ్ లాంటి హిట్ మూవీ తరువాత నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అటు తమిళ్లోను ఇటు తెలుగులోను మంచి అంచనాలు మొదలయ్యాయి. ఇక వచ్చే ఏడాది జనవరి 26 న ఈ సినిమా తెలుగు, తమిళంలోనూ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Samantha As Rathi Devi:

Samantha Is Rathi Devi in Abhimanyudu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ