Advertisementt

'అజ్ఞాతవాసి' గుడ్ న్యూస్..!

Wed 27th Dec 2017 02:25 PM
pawan kalyan,agnathavasi,venkatesh,guest role,kushboo,trivikram srinivas  'అజ్ఞాతవాసి' గుడ్ న్యూస్..!
Good News about Pawan Agnathavasi 'అజ్ఞాతవాసి' గుడ్ న్యూస్..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం అందరి కళ్లు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌-పవన్‌ కళ్యాణ్  ల కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ మూవీగా రూపొందుతున్న 'అజ్ఞాతవాసి'పైనే ఉన్నాయి. ఇది పవన్‌కి 25వ ప్రతిష్టాత్మక చిత్రం కావడం కూడా విశేషం. అనిరుద్‌ సంగీతం అందించిన పాటలు ఓ ఊపు ఊపుతుంటే, ప్రేక్షకులు టీజర్‌ మాయలో పడిపోయారు. ఈ టీజర్‌ సౌత్‌ఇండియాలోనే సోషల్‌మీడియాలో రికార్డులు నమోదు చేసింది. ఇక ఈ చిత్రంలో పవన్‌ స్వంతగా పాడిన పాటను నూతన సంవత్సర కానుకగా రిలీజ్‌ చేసి సినిమా విడుదలకు కేవలం వారం రోజుల ముందు మాత్రమే ట్రైలర్‌ని విడుదల చేస్తారని సమాచారం. 

ఇక ఈ చిత్రంలో ఖుష్బూ కీలకపాత్రను చేస్తుండగా, సీనియర్‌ స్టార్‌ వెంకటేష్‌ ఓ ప్రత్యేక అతిధి పాత్రలో కనిపిస్తాడట. అంటే వెంకీ నటించిన మొదటి చిత్రం 'కలియుగ పాండవులు'లో కనిపించిన వెంకీ-ఖుష్బూల జంట మరోసారి తెరపై రిపీట్‌ కానుండటం విశేషం. మరోవైపు త్రివిక్రమ్‌ వెంకటేష్‌ నటించిన 'నువ్వు నాకు నచ్చావ్‌, మల్లీశ్వరి' వంటి చిత్రాలకు అన్ని తానై నడిపాడు. ఆ చిత్రాలు సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు. కాగా త్వరలో వెంకీనే హీరోగా హారిక అండ్‌ హాసిని బేనర్‌లో ఎన్టీఆర్‌ చిత్రం అనంతరం త్రివిక్రమ్‌తో వెంకీ జతకడుతున్నాడు. 

ఇక 'అజ్ఞాతవాసి'లో వెంకీ కథను కీలకమైన మలుపు తిప్పే పాత్ర చేయనున్నాడు. ఈ పాత్రకి సంబంధించిన డబ్బింగ్‌ని కూడా వెంకీ పూర్తి చేశాడట. ఈ పాత్ర నాలుగైదు నిమిషాల పాటు ఉంటుందని ఆ కొద్ది నిడివిలోనే వెంకీ చేత అద్భుతమైన డైలాగ్స్‌ని త్రివిక్రమ్‌ పలికించాడని సమాచారం. వెంకీ పాత్రతో పవన్‌ క్యారెక్టర్‌ని కలిపేలా ఈ సీన్స్‌ ఉంటాయని తెలుస్తోంది. మరోవైపు వెంకీ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తుండగా, త్వరలో మొదటి వెబ్‌సిరీస్‌గా అబ్బాయి రానాతో కలిసి నటించనున్నాడు. 

Good News about Pawan Agnathavasi:

Venkatesh in Pawan Kalyan Agnathavasi Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ