Advertisementt

దిల్‌రాజుకి చేసిన తప్పు తెలిసివచ్చిందట!

Wed 27th Dec 2017 01:47 PM
dil raju,mca movie,sai pallavi,nani,romance scenes,edit  దిల్‌రాజుకి చేసిన తప్పు తెలిసివచ్చిందట!
Dil Raju Knows the Truth After MCA Release దిల్‌రాజుకి చేసిన తప్పు తెలిసివచ్చిందట!
Advertisement
Ads by CJ

సాధారణంగా మన స్టార్‌ హీరోలు, నిర్మాతలు దర్శకులను వారు తియ్యనిచ్చేది తీయనిచ్చి ఎడిటింగ్‌ రూమ్‌లో మాత్రం వారిని కాదని తామే ఏ సీన్స్‌ని ఉంచాలి? వేటికి కత్తెర వేయాలని అని నిర్ణయిస్తూ చేతిలో కత్తి పట్టుకుని ఉంటారు. దీని వల్ల కొన్నిసార్లు మేలు జరుగుతుంది.. మరికొన్ని సార్లు చెడు కూడా జరుగుతుంది. 'రాజు గారి గది' చిత్రం పెద్ద విజయం సాధించడానికి, అది లోబడ్జెట్‌ చిత్రమైనా కూడా అందులోని కామెడీ హైలైట్‌గా నిలిచింది. కానీ అదే 'రాజు గారి గది 2' విషయానికి వస్తే అందులో షకలక శంకర్‌పై తీసిన కామెడీ ట్రాక్‌ అద్భుతంగా వచ్చిందని మొదట్లో టాక్‌ వచ్చింది. ఈ చిత్రం ట్రైలర్‌లో కూడా షకలకశంకర్‌, వెన్నెలకిషోర్‌ వంటి వారిపై తీసిన ఒక బిట్‌ చూపించారు. కానీ సీరియస్‌గా సాగుతున్న కథకి ఇది అడ్డంకి అని నాగార్జున భావించి వాటిని ఎడిటింగ్‌లో లేపేయడంతో సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ తగ్గి నష్టం జరిగిందనే వార్తలు వచ్చాయి. 

ఇక తాజాగా దిల్‌రాజు నిర్మించిన 'ఎంసిఏ' చిత్రంలో కూడా నాని, సాయిపల్లవి మధ్య వచ్చే రొమాన్స్‌ సీన్స్‌, ఇద్దరి కెమిస్ట్రీ స్కీన్‌పై హైలైట్‌ అయిందని వార్తలు బయటికి వచ్చాయి. కానీ దిల్‌రాజు మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ కోసం నాని - భూమికల మధ్య వచ్చే వదిన-మరిది ఎమోషనల్‌ సీన్స్‌కి ఎక్కువ చోటిచ్చి నాని, సాయిపల్లవి మధ్య వచ్చే రొమాన్స్‌ సీన్స్‌కి కత్తెర వేయడంతో ఈ చిత్రంలో యూత్‌ఫుల్‌నెస్‌ మిస్సయిందని అంటున్నారు. దాంతో దిల్‌రాజు కూడా ఇప్పుడు పునరాలోచనలో పడిపోయాడని తెలుస్తోంది. కాస్త నిడివి ఎక్కువైనా ఆ సీన్స్‌ని మరలా ఏమైనా యాడ్‌ చేస్తారా? లేక అలాగే ఉంచుతారా? అనే నిర్ణయం దిల్‌రాజు చేతుల్లోనే ఉందని అంటున్నారు. 

Dil Raju Knows the Truth After MCA Release :

Sai Pallavi and Nani Romancing Scenes Edited From MCA Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ