సినిమా చాలా బాగుందని ప్రేక్షకుల దగ్గర నుండి మంచి కామెంట్స్ వచ్చాయి. క్రిటిస్ నుండి కూడా రెస్పాన్స్ బాగొచ్చింది. కాని 3 రోజుల్లో 'హలో' సినిమాకు కేవలం 10+ కోట్లు షేర్ వచ్చింది. దానికి ముందు రోజే రిలీజ్ అయ్యిన 'ఎంసిఏ' సినిమాకు రొటీన్ అంటూ సర్టిఫికేట్లు ఇచ్చినా కూడా 4 రోజుల్లో 21+ కోట్ల షేర్ వసూలైంది.
నిజానికి సినిమా బాగుంటే సోషల్ మీడియాలో గాని, బయట జనాలు చెప్పేవేమి గుర్తుకు రావు. కానీ హలో విషయం మాత్రం బి అండ్ సి సెంటర్లలో సినిమాను అంతగా ఆదరించట్లేదనే అనుకోవాలి. కమర్షియల్ కంటెంట్ ఉన్న ఎంసిఏ కు ఆదరణ చూస్తుంటే..విక్రమ్ కె కుమార్ మ్యాజిక్ పనిచేయట్లేదు అని చెప్పుకోవాలి. ఎంసిఏ సినిమా కూడా గత రెండు రోజులు నుండి కలెక్షన్స్ తగ్గాయి.
ఇక ఈ వారంలో.. ఒక్క క్షణం ఆ తరువాత 2 కంట్రీస్ సినిమాలు పోటీగా వస్తున్నాయి. ఆ రెండింటిలో ఏదన్నా ఒక్కటి కనక్ట్ అయితే మాత్రం..హలో, ఎంసిఏ సినిమాల జర్నీ ముగిసినట్లే. లేదంటే మెల్లగా జనవరి 1వ వారం వరకు ఇదే తరహాలో బండి నడిచే ఛాన్సుంది.