Advertisementt

చిరు, ఎన్టీఆర్, బన్నీల గురించి శేఖర్‌మాస్టర్‌!

Wed 27th Dec 2017 01:30 PM
sekhar master,chiranjeevi,ntr,allu arjun,dance carrier  చిరు, ఎన్టీఆర్, బన్నీల గురించి శేఖర్‌మాస్టర్‌!
Sekhar Master About Chiru, NTR and Bunny చిరు, ఎన్టీఆర్, బన్నీల గురించి శేఖర్‌మాస్టర్‌!
Advertisement

ఓవైపు డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌గా బిజీగా ఉంటూనే మరోవైపు డ్యాన్స్‌షోలకు జడ్జిగా శేఖర్‌ మాస్టర్‌ బిజీ బిజీగా ఉంటున్నాడు. ఆయన మాట్లాడుతూ, విజయవాడలో ఉన్నప్పుడు నాకు డ్యాన్స్‌పై మక్కువ ఏర్పడింది. సినిమా ఫీల్డ్‌కి వెళ్లవచ్చు కదా? అని భావించి హైదరాబాద్‌కి వచ్చి గ్రూప్‌ డ్యాన్సర్‌గా చేశాను. తర్వాత రాకేష్‌ మాస్టర్‌ వద్ద అసిస్టెంట్‌గా చేసి, తర్వాత కొరియోగ్రాఫర్‌ని అయ్యాను. ఇక నేను మెగాస్టార్‌ చిరంజీవి గారికి డ్యాన్స్‌కంపోజ్‌ చేసిన రోజుని మర్చిపోలేను. చిరంజీవి నాకో ల్యాప్‌ట్యాప్‌ని బహుమతిగా ఇచ్చి, ఇక మనం చేసే సాంగ్స్‌ని దీనిలోనే చూసుకోవాలి అని చెప్పారు. 

ఇక ఇండస్ట్రీకి వచ్చాను... చేస్తున్నాను.. ఎదగలేకపోతున్నాను.. తిరిగి వెళ్లిపోదామని భావిస్తున్న సమయంలో అల్లుఅర్జున్‌గారు ఫోన్‌ చేసి అవకాశం ఇచ్చారు. ఇక నేను 'ఇద్దరు అమ్మాయిలతో' చిత్రంలో చేసిన 'టాపు లేచిపోద్ది' సాంగ్‌ చూసి ప్రభుదేవా గారు తాను బాలీవుడ్‌లో తీసిన 'యాక్షన్‌ జాక్సన్‌' చిత్రంలో రెండు పాటలకు ఛాన్స్‌ ఇచ్చారు. ఆయన డ్యాన్స్‌లో లెజెండ్‌. అంతటి వ్యక్తి  పిలిచి మరీ నా సినిమాకి పనిచేస్తావా? అని అడగటం మర్చిపోలేను. ఆయనే గొప్ప డ్యాన్స్‌ మాస్టర్‌ అయి ఉండి.. శేఖర్‌ మాస్టర్‌.. హీరో, హీరోయిన్లకు ఆ మూమెంట్‌ కష్టంగా ఉందిట. వారికోసారి చెప్పు అని, మరోసారి నేను కంపోజ్‌ చేసిన స్టెప్స్‌ని ప్రభుదేవాగారే చూసి వాటిని హీరోహీరోయిన్లకు నేర్పడం చూసిన రోజుల్లో నాకు నిద్ర కూడా పట్టేది కాదు. 

ఇక నన్ను ఎక్కువగా చేరదీసి అవకాశాలిచ్చింది ఎన్టీఆర్‌ గారు. నా సినిమాలో రెండు మూడు పాటలు శేఖర్‌ మాస్టర్‌ చేయాలని ఆయన చెప్పేవారు. అలా 'బంతిపూల జానకి, డైమండ్‌ గర్ల్‌, ఆపిల్‌ బ్యూటీ, పక్కాలోకల్‌, స్వింగుజరా..' పాటలు నాకెంతో పేరు తెచ్చాయి. నేను ఎన్టీఆర్‌ గారికి ఎంతో రుణపడి ఉన్నాను.. అని చెప్పుకొచ్చారు.

Sekhar Master About Chiru, NTR and Bunny:

Sekhar Master Talks About His Dancing Carrier

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement