టాలీవుడ్ లో ప్రస్తుతం ఓ హిట్ ఫార్ములా నడుస్తుంది. సినిమాలో ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు ఆ సినిమా హిట్ అయిపోతుంది. మొదటి సినిమా నుండి అదే ఫార్ములాని కంటిన్యూ చేస్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. లేటెస్ట్ గా రాజా ది గ్రేట్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ స్టైల్ లో సక్సెస్ ఫుల్ కథలను రాస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ ని ఇస్తున్నాడు అనిల్ రావిపూడి.
అదేవిధంగా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ కథతో మరోసారి సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాకు F2 అనే టైటిల్ కూడా పెట్టాడు. అయితే ఈ సినిమా మల్టీస్టారర్ అని అందరికి తెలిసిందే. ఆల్ రెడీ విక్టరీ వెంకటేష్ ఒక హీరోగా సెలెక్ట్ అయ్యాడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే రెండో హీరో మాత్రం ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. మొన్నటి వరకు రానా - సాయి ధరమ్ తేజ్ ను మరో హీరోగా అనుకున్నారు. కానీ వారిద్దరు కుదరకపోవడంతో ఇప్పుడు దిల్ రాజు.. వరుణ్ తేజ్ ని సెలెక్ట్ చేసినట్లు సమాచారం.
వరుణ్ తేజ్ అయితే ఈ కథకు సూట్ అవుతాడని భావించి దిల్ రాజు సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. దీనికి అనిల్ కూడా ఒకే చెప్పేశాడు. కుదిరితే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో లాంచింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టి వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేస్తారట.