నేడు తెలుగులో ఉన్న టాప్ డైరెక్టర్స్‌లో వినాయక్ ఒకరు. ఆయన హీరోయిజాన్ని పీక్స్‌లో చూపించడమే కాదు.. ఓ కమర్షియల్ చిత్రానికి కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్, సాంగ్స్ అని పక్కాగా ప్రతి ఆడియన్‌కి చేరువయ్యేలా చూసుకుంటాడు. అందుకే మాస్, యాక్షన్ ఇమేజ్ కావాలని భావించే ఏ హీరో అయినా వినాయక్‌తో ఓ చిత్రం చేయాలని భావిస్తారు. బి.గోపాల్ తర్వాత ఈ విషయంలో వినాయక్, బోయపాటి శ్రీనులే ఈ కోవలోకి వస్తారు. అందుకే పలువురు బిగ్‌స్టార్స్ కూడా తమ ముఖ్యమైన చిత్రాలకు మెయిన్ ఆప్షన్‌గా వినాయక్‌నే తీసుకుంటారు.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నుంచి అఖిల్ వరకు అదే బాటలో నడవగా, చిరంజీవి వినాయక్‌తో 'ఠాగూర్' చేసి మరలా తన దశాబ్దపు కాలం తర్వాత రీఎంట్రీ ఇస్తూ 150వ ప్రతిష్టాత్మక చిత్రమైన 'ఖైదీనెంబర్ 150' బాధ్యతలను కూడా వినాయక్‌కే అప్పగించాడు. ఇక విషయానికి వస్తే కొన్ని రూమర్లు ఎలా ప్రచారంలోకి వస్తాయో తెలియదు. సాయిధరమ్‌తేజ్ 'తొలిప్రేమ' దర్శకుడు కరుణాకరన్‌తో ఓ చిత్రం చేస్తుంటే దానికి 'తొలి ప్రేమ' సీక్వెల్ అని ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదని తేలిపోయింది. మరోవైపు సాయిధరమ్‌తేజ్ ప్రస్తుతం వినాయక్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. దీంతో ఈ చిత్రం రామ్‌చరణ్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన నాయక్‌కి సీక్వెల్ అనే వార్తలు షికారు చేశాయి.
మరో ముందడుగు వేసి ఈ చిత్రం కథ విషయంలో సాయిధరమ్‌తేజ్‌కి, వినాయక్‌కి గొడవలు కూడా వచ్చాయనేంతగా వార్తలు వ్యాపించాయి. అయినా 'నాయక్', 'అదుర్స్' వంటి వాటికి సీక్వెల్స్ అయితే రావచ్చేమో గానీ ప్రతి చిత్రాన్ని వీటికి సీక్వెల్స్‌గా ప్రచారం చేయడం ఆశ్చర్యకరం. అయినా వినాయక్ 'నాయక్'కి సీక్వెల్ చేస్తే అది రామ్‌చరణ్‌తోనే చేస్తాడు. అంతేగాక 'నాయక్' ఏమీ బ్లాక్‌బస్టర్ మూవీ కాదు. అదో యావరేజ్ మూవీ మాత్రమే. దానికి సీక్వెల్ చేయడం అనేది జరిగే పనికాదు. మరి ఇలాంటి వార్తలు పుట్టించేవారు వాటిని ఎలా పుట్టిస్తారా? అనేది ఆశ్చర్యం కలుగుతుంది.