యాంకర్ గా అడుగుపెట్టిన అనసూయ జబర్దస్త్ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు టీవి షోస్ తో పాటు.. ఆడియో వేడుకలకి హోస్ట్ గా... అలాగే ఇటు సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటుతుంది అనసూయ. అప్పుడెప్పుడో సోగ్గాడే చిన్ని నాయన, క్షణం వంటి సినిమాలలో నటించి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది ఈ హాట్ యాంకర్. ఇప్పుడు కూడా రామ్ చరణ్ రంగస్థలంలో కీ రోల్ ప్లే చెయ్యడమే కాదు.. అనసూయ మెయిన్ లీడ్ లో 'సచ్చింది రా గొర్రె' సినిమాలో నటిస్తుంది.
ఇంత బిజీగా ఉంటున్న అనసూయకి ఒక ఫ్యామిలీ ఉంది. ఆమెకి ఇద్దరు పిల్లలు కూడా. అయితే అనసూయ పిల్లలను ఆమె భర్త ఎంతో కేర్ గా చూసుకుంటూ అనసూయకి అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తూ ఆమె కెరీర్ కి ఉపయోగపడుతున్నాడు. అయితే ఇప్పుడు అనసూయ భర్త కూడా సినిమా ఇండస్ట్రీలోకి నటుడిగా రావాలి అని ఫిక్స్ అయ్యాడు అని తెలుస్తుంది. సుశాంక్ భరద్వాజ్ కి అనసూయ వల్ల యాక్టింగ్ లో ఇంట్రెస్ట్ కలిగిందట. సో ఇప్పుడు అనసూయకి ఉన్న కాంటాక్ట్స్ ని ఉపయోగించి ఏదైనా ఒక మూవీ లేక టీవి షో ద్వారా తన ఎంట్రీ ఇవ్వాలి అని కోరుకుంటున్నాడట.
కానీ అనసూయ సన్నిహితులు మాత్రం సుశాంక్ కి నటన అంటే ఇష్టం లేదు.... బ్యాంక్ జాబ్ చేస్తూ హాయిగా ఉన్నాడు. తనకి మూవీ ఫీల్డ్ పై అస్సలు ఇంట్రెస్ట్ లేదు అని అంటున్నారు. అయితే అనసూయ మాత్రం ఇప్పటికే తన భర్త గురించి పలువురి డైరెక్టర్స్ దగ్గర మాట్లాడినట్టు తెలుస్తుంది. మొత్తానికి భర్తని ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి అనసూయ బాగానే కష్టపడుతుంది.