చిరంజీవికి సినిమాల విషయంలో, కుటుంబ వ్యవహారాలలో, రాజకీయాలలో కూడా అల్లుఅరవింద్ కుడిభుజంగా మెలిగాడు. వారిద్దరు శ్రీకృష్ణుడు-అర్జునుడు వంటి వారని కొందరు వర్ణిస్తారు. ఇక వీరి మధ్య బావా బావమరుదుల బంధుత్వం కన్నా స్నేహమే ఎక్కువ. కానీ చిరంజీవిని తమకు కానివ్వకుండా చేశాడని చిరంజీవి ఎదుగుదలలో సహాయపడిన కోదండరామిరెడ్డి, కె.యస్.రామారావు, యండమూరిలతో పాటు చిరంజీవి స్నేహితులైన పిచ్చకొట్టుడు సుధాకర్, నారాయణరావు, ప్రసాద్‌బాబు వంటి వారు బాధపడుతూ ఉంటారని అంటుంటారు. ఓ సందర్భంలో చిరు స్నేహితుడైన కమెడియన్ సుధాకర్ 'ఆ పొట్టొడి' వల్లనే మాకు చిరు కాకుండా పోయాడని వ్యాఖ్యానించాడు.
ఇక చిరంజీవిని అడ్డుపెట్టి ఆయన నిర్మాతగా గీతాఆర్ట్స్‌ను విజయపధంలో నడిపాడని, తన కుమారులను కూడా చిరు పేరుతో మెగాభిమానులకు దగ్గర చేసి వదిలేశాడని వార్తలు వస్తున్నాయి. ఇక ఇటీవల పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం, తనను కాకుండా బన్నీని పీఆర్పీ తరపున ప్రచారానికి అల్లుఅరవింద్ పంపడం వంటి విషయాలపై అన్యాపదేశంగా పవన్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఇక చెప్పను బ్రదర్ తర్వాత అల్లుఅరవింద్ అన్నా, బన్నీ, శిరీష్‌లన్నా ఎక్కవమంది మెగాభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపధ్యంలో అల్లుఅరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిరంజీవి తనని నమ్మి అనేక బాధ్యతలను అప్పగించారని, వాటిని సక్రమంగా నిర్వహించేందుకు తాను శాయాశక్తుల కృషి చేశానని తెలిపాడు. చిరంజీవి బాధ్యతలన్నింటినీ తనే చూసుకోవడంతో చిరంజీవి మరో దాని మీద మనసు లేకుండా పూర్తి దృష్టిని నటనపైనే పెట్టాడని చెప్పాడు.
ఇద్దరి మధ్య విబేధాలున్నాయన్న విషయం నిజం కాదని, సినిమా ఇండస్ట్రీలో ఇన్నేళ్లు సంబంధాలను నిలిపిన వారు అరుదు. బాపు-రమణ, ఎస్వీకృష్ణారెడ్డి - అచ్చిరెడ్డి, తర్వాత నేను, చిరంజీవినే తమ బంధాలను నిలుపుకున్నామని చెప్పాడు. ఇక పీఆర్పీ సమయంలో తాము టఫ్ సిట్యూవేషన్స్ ఎదుర్కొన్నామని, కానీ అవి నీటిపై బుడగల్లా తేలిపోయాయని, ఇద్దరు వ్యక్తుల మధ్య స్ట్రాంగ్ అండర్‌స్టాడింగ్ ఉంటేనే అది సాధ్యమని తెలిపాడు. కానీ పవన్ ప్రస్తావన గానీ, చెప్పను బ్రదర్ వంటి వ్యాఖ్యలను మాత్రం ప్రస్తావించలేదు. ఎప్పటిలాగే తాము ముందుకు సాగుతున్నామని కేవలం చిరు గురించి మాత్రమే చెప్పుకొచ్చాడు.