ఆమధ్య వచ్చిన 'అత్తారింటికి దారేది' చిత్రంలోని స్పెషల్ సాంగ్‌లో హాట్ యాంకర్ అనసూయకి అవకాశం ఇచ్చినా కూడా ఆమె దానికి నో చెప్పడం, ఆ తర్వాత తాను కేవలం స్పెషల్ సాంగ్స్ అంటే చేయనని తనకంటూ కొంత ప్రత్యేకత ఉండాలని చెప్పి నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్నినాయనా'తో పాటు సాయిధరమ్‌తేజ్‌తో కూడా స్పెషల్‌సాంగ్ చేసింది. దాంతో మెగాభిమానులు మరీ ముఖ్యంగా పవన్ అభిమానులు మా హీరో సినిమాలో ఛాన్స్ ఇచ్చినా చేయనంటావా? అని మండిపడ్డారు. కానీ ఆ తర్వాత మాత్రం తేజూతో పాటు తాజాగా మరో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో మైత్రిమూవీమేకర్స్ నిర్మిస్తోన్న 'రంగస్థలం 1985'లో అనసూయ ఓ కీలక పాత్రను పోషిస్తోంది. ఇక దీంతో మెగాభిమానులు ఆనందానికి హద్దే లేకుండా ఉంటూ, మరలా అనసూయ అంటే కోపం తగ్గి శాంతిస్తున్నారు. ఇక స్టార్ హీరోలు నటించే చిత్రాలలో నటించేవారు సినిమా విడుదలకు ముందే ఆ చిత్రంలోని సంగతులను వివరిస్తున్నా, షూటింగ్ సంగతులను పంచుకున్నా కూడా అభిమానులలో ఉండే ఉత్సాహం, సంతోషం సామాన్యంగా ఉండదు. ఎవరి నోట నుంచి అయినా సరే తమ అభిమాన స్టార్ చిత్రం పేరుగానీ, వారి మాట గాని వినపడిందంటే ఆ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వాటిని ఫాలో అవుతూ ఉంటారు. ఇక తాజాగా 'రంగస్థలం 1985' సెట్లో ఈ చిత్రంలో ఓ కీలకపాత్రను చేస్తున్న అనసూయ ఈ చిత్రం హీరో రామ్‌చరణ్‌తో కలిసి ఓ సెల్ఫీ దిగింది. ఇందులో అనసూయ సినిమా కాస్ట్యూమ్స్‌లో కాకుండా మామాలు డ్రస్ వేసుకుని ఉండగా, రామ్‌చరణ్ మాత్రం సినిమాలోని కాస్టూమ్స్, లుక్స్‌తోనే కనిపిస్తున్నాడు. ఈ సెల్ఫీలో అనసూయ కుమారుడు కూడా ఉన్నాడు. ఈ ఫొటోని అనసూయ సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ.. రామ్‌చరణ్ ఎంతో మంచి వ్యక్తి. రంగస్థలం సినిమా వచ్చే వరకు ఎదురుచూడండి..అతను అందరూ గర్వించేలా చేస్తాడని తెలిపింది. ఈ చిత్రంలోని ఓ అద్భుత సన్నివేశం తర్వాత దిగిన సెల్ఫీ ఇది. ఈరోజును మీకు మరింత ఆనందదాయకం చేయాలని భావిస్తున్నాను.. అని తెలపడంతో మెగాభిమానులు ఖుషీగా ఉన్నారు. కాగా ఈచిత్రం మార్చి 30న విడుదల కానుంది.