Advertisementt

బాలయ్యని తక్కువంచనా వేయొద్దు..!!

Mon 25th Dec 2017 09:42 PM
agnathavasi,balakrishna,pawan kalyan,jai simha,sankranthi,fans  బాలయ్యని తక్కువంచనా వేయొద్దు..!!
Agnathavasi Vs Jai Simha in Sankranthi Race బాలయ్యని తక్కువంచనా వేయొద్దు..!!
Advertisement
Ads by CJ

వచ్చే సంక్రాంతికి పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసితో పాటు బాలకృష్ణ జై సింహా సినిమా రిలీజ్‌ అవుతున్నప్పటికీ వార్ వన్‌ సైడే అన్నట్టుగా ఉంది సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేసే హడావిడి. అంతే కాకుండా బయట టాక్ కూడా అజ్ఞాతవాసి ముందు జై సింహా బలాదూర్ అన్నట్టుగా అనిపిస్తుంది. అయితే బాలకృష్ణ జై సింహా చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు లేకపోవడంతో ఫ్యాన్స్ కూడా ఈ చిత్రం పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం లేదనే టాక్ వినబడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం ముఖ్యంగా పరిగణనలోకి తీసుకోవాలి. అదేమిటంటే  జై సింహా అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ సినిమా. సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలు ఎంత బాగా ఆడాయో అదే రీతిన మాస్‌ సినిమాలు కూడా దుమ్ము దులిపాయి. 

మరి దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన అజ్ఞాతవాసి చిత్రంలో క్లాస్‌ కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కానీ కేఎస్ రవికుమార్ తెరకెక్కించిన  జై సింహా మాత్రం ఊర మాస్‌గా బి, సి ఆడియన్స్‌ని మాత్రమే దృష్టిలో వుంచుకుని తెరకెక్కినట్టుగా వుంది. అయితే అజ్ఞాతవాసి కనుక మాస్‌ని ఆకట్టుకోవడంలో విఫలమై, జై సింహా గర్జనలు వారికి బాగా నచ్చితే ఈ చిత్రానికి వుండే రెవెన్యూ దీనికి వుంటుంది. ఇకపోతే బాలకృష్ణ సినిమాలని ప్రిడిక్ట్‌ చేయడం చాలా కష్టం. విడుదలకి ముందు ఎటువంటి భారీ అంచనాలు లేని సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద సంచలనాలు క్రియేట్ చేసిన హిస్టరీ బాలయ్యకి వుంది. 

అందులోను బాలకృష్ణకి సంక్రాంతి కలిసొచ్చే సెంటిమెంట్ కూడా ఉంది. చూద్దాం మాస్ ఆకట్టుకుంటుందా.. లేకుంటే క్లాస్ ఆకట్టుకుంటుందా అనేది మరో రెండు వారాల్లో తేలిపోతుంది. ఇక పవన్ అజ్ఞాతవాసి జనవరి 10 న విడుదలవుతుంటే.... బాలకృష్ణ జై సింహా జనవరి 12 న విడుదలవుతుంది.

Agnathavasi Vs Jai Simha in Sankranthi Race:

Agnathavasi Class Movie and Balayya Jai Simha Mass Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ