ప్రభాస్ అంటే బాహుబలి. బాహుబలి అంటే ప్రభాస్ అన్నట్టుగా వుంది. ప్రభాస్ అంతలా బాహుబలిగా అందరి మదిలో నిలిచిపోయాడు. బాహుబలి సినిమాలో ప్రభాస్ ని తప్ప మరో స్టార్ ని మనం ఊహించుకోగలమా అంటే.. వెంటనే నో అనేస్తాం. ఆరడుగుల ఆజానుబాహుడు... రాజు అంటే బాహుబలి ప్రభాస్ మాత్రమే అనేట్టుగా ప్రభాస్ బాహుబలి పాత్రలో జీవించాడు. బాహుబలి తర్వాత కూడా ప్రభాస్ నుండి ఎలాంటి... సినిమా వస్తుంది... ఈ సినిమాలో ప్రభాస్ ని మనం ఎలా చూడబోతున్నాడనే విషయం సాహో టీజర్ లోను, సాహో ఫస్ట్ లుక్ లోను అర్ధమయ్యింది. బాహుబలి తర్వాత ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మాణంలో సాహో లో నటిస్తున్నాడు.
ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా ముందు రకరకాల పేర్లు వినబడినప్పటికీ ఫైనల్ గా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ని తీసుకున్నారు. అయితే ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా తీసుకోవడం కరెక్ట్ అంటున్నాడు ప్రభాస్. ఎందుకంటే.. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ పాత్ర చాలా కీలకమైనదని.. కేవలం శ్రద్ధాని పాటలు.... డ్యాన్స్ లకోసం మాత్రమే తీసుకోలేదని చెబుతున్నాడు. అంతేకాకుండా శ్రద్ధా కపూర్ ని పొగడ్తలతో ముంచెత్తాడు. శ్రద్ధా కపూర్ సాహోలో తనకి హీరోయిన్ కావడం తన అదృష్టమని.... యాక్షన్ సన్నివేశాల కోసం శ్రద్ధా కపూర్ చాలా కష్టపడిందని చెప్పుకొచ్చాడు.
అలాగే తనకి శ్రద్ధా కపూర్ నటనతో పాటే....సినిమాలపై ఉన్న ఆసక్తిని చూసి ఆశ్చర్యం కలిగించిందని చెబుతున్నాడు. తనతో నటించిన చాలామంది హీరోయిన్లు ముందు టాలీవుడ్ లో నటించి ఆపై బాలీవుడ్ కు వెళ్లారని... కానీ శ్రద్ధా కపూర్ మాత్రం అక్కడ బాలీవుడ్ లో పాపులర్ అయిన తర్వాతే ఇక్కడ నటిస్తోందని శ్రద్ధాని పొగిడేశాడు ప్రభాస్. ఇకపోతే ఈ సినిమాలో హాలీవుడ్ సినిమాల రేంజ్ లో యాక్షన్ సన్నివేశాలుంటాయనే విషయం సినిమా ఓపెనింగ్ దగ్గరనుండి ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని మాత్రం అస్సలు క్లారిటీ లేదు.