Advertisementt

'సై రా' లో విజయ్ పాత్ర ఇదేనా..?

Mon 25th Dec 2017 05:49 PM
vijay sethupathi,sye raa narasimha reddy,chiranjeevi,obayya  'సై రా' లో విజయ్ పాత్ర ఇదేనా..?
Vijay Sethupathi Role in Sye Raa Narasimha Reddy Movie 'సై రా' లో విజయ్ పాత్ర ఇదేనా..?
Advertisement
Ads by CJ

చిరంజీవి 'సై రా నరసింహారెడ్డి' సినిమా సెట్స్ మీదకెళ్ళిపోయి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. సినిమా ఓపెనింగ్ జరుపుకున్న దాదాపు మూడు నెలలకు సెట్స్ మీద కెళ్లిన ఈ సినిమాలో అమితాబచ్చన్, సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి వంటి వారు నటిస్తున్నారు. అలాగే హీరోయిన్స్ లో మెయిన్ లీడ్ లో నయనతార నటిస్తుండగా... ప్రగ్య జైస్వాల్ మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఇకపోతే సై రా కోసంమరో హీరోయిన్ ఎంపిక బ్యాలెన్స్ ఉంది. ఇక టాప్ టెక్నీకల్ టీమ్ ఈ సై రా నరసింహారెడ్డి కోసం పనిచేస్తున్నారు.

అయితే ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా.. రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సై రా నరసింహారెడ్డిగా చిరు నటిస్తుండగా.. మిగతా టాప్ స్టార్స్ ఏ ఏ పాత్రల్లో నటిస్తున్నారని విషయం క్లారిటీ లేదు. ఇకపోతే తమిళంలో ప్రస్తుతం స్టార్ హీరో హోదాలో కొనసాగుతున్న విజయ్ సేతుపతి సై రా లో ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలియసిందే. అసలు సై రా లో విజయ్ సేతుపతి కీలక పాత్ర చేస్తున్నప్పటికీ ఎలాంటి రోల్ అనేది క్లారిటీ లేదు.

కానీ ఇప్పుడు విజయ్.. సై రా లో ఎలాంటి పాత్ర చేస్తున్నాడో అనేది బయటికి వచ్చింది. నిజ జీవితంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అత్యంత నమ్మకమైన అనుయాయుల్లో ఓబయ్య ఒకడు. ఎప్పుడూ ఉయ్యాలవాడ వెన్నంటే ఉంటాడు. ఉయ్యాలవాడ పోరాటంలో తనూ పాలుపంచుకున్నాడు. అయితే  ఈ పాత్ర సై రా సినిమాలో చాలా కీలకమట. దాదాపుగా సినిమా అంత ఈ పాత్ర ఉంటుందని సమాచారం. కచ్చితంగా ఈ పాత్ర సై రా నరసింహారెడ్డి  సినిమాలో మేజర్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. మరి ఇలాంటి పవర్ఫుల్ రోల్ లో విజయ్ సేతుపతిని చూడబోతున్నమాట.

Vijay Sethupathi Role in Sye Raa Narasimha Reddy Movie:

Vijay Sethupathi Powerful Role in Chiru Sye Raa

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ