స్టార్ హీరోల రెమ్యూనరేషన్స్ సినిమా సినిమాకి పెరుగుతూనే ఉంటుంది గాని తగట్లేదు. సినిమా హిట్టా.. ప్లాపా..అని సంబంధం లేకుండా స్టార్ హీరోలు రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ సినిమాకు ఏకంగా 20 నుండి 30 కోట్లు కూడా తీసుకుంటున్నారు. అందులో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాకు 40 కోట్లు పుచ్చుకున్నాడని అనేక రూమర్ల కూడా వచ్చాయి.
లేటెస్ట్ గా ఫోర్బ్స్ మ్యాగ్ జైన్ విడుదల చేసిన సెలబ్రిటీ 100 జాబితా లిస్ట్ లో పవన్ కళ్యాణ్ కు 69వ స్థానం కట్టపెడుతూ.. గత సంవత్సరం ఆగస్టు నుండి ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు ఆయన ఆధాయం 11.33 కోట్లు అని చెప్పింది ఫోర్బ్స్. అంటే ఈ సంవత్సర కాలంలో సర్దార్ గబ్బర్ సింగ్ మరియు కాటమరాయుడు సినిమాలను చేశాడు పవన్. ఆ రెండింటికి సినిమాకు 20 కోట్లు పుచ్చుకున్నా కూడా.. ఆదాయపు పన్ను కట్టేశాక... ఆయన దగ్గర 28 కోట్లు వుంటుంది. కాని అక్కడ చెప్పినట్లు 11 కోట్లు ఉందంటే.. రెండు సినిమాలకు 16 కోట్లు వచ్చుండాలి. అంటే పవన్ రెమ్యూనరేషన్ 8 కోట్లేనా?
గతంలో ఈ ఫోర్బ్స్ లెక్కలపై కింగ్ నాగార్జున స్పందిస్తూ.. అసలు ఇవ్వని తప్పుడు లెక్కలు అని కొట్టిపారేశాడు నాగ్. అవి తప్పుడు నంబర్స్ అని ఆదాయాన్ని ఎక్కువగా ప్రచురించేశారని ఆయన అన్నారు. ఆ లెక్కన చూస్తే ఇప్పుడు పవన్ ఆధాయం లెక్క గురించి ఏమనాలో ఏంటో!!