రాజా ది గ్రేట్ సక్సెస్ తర్వాత రవితేజ సినిమా టచ్ చేసి చూడు సినిమా రాబోతుంది. ఈ సినిమా సంక్రాంతికి వస్తుందనుకుంటే రెండు పెద్ద సినిమాలు ఉండటంతో సంక్రాంతి నుండి అదే నెల 25 కు షిఫ్ట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత రవితేజ సోగ్గాడే చిన్ని నాయన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఓ సినిమా కూడా అధికారికంగా అనౌన్స్ చేశాడు రవి.
ఈ సినిమా ఓపెనింగ్ జనవరి 5 న జరగనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ఇప్పటివరకు బయటకు రాలేదు. సినిమా అనుకున్న దగ్గర నుండి చాలా టైటిల్స్ అనుకున్నా... ఏ టైటిల్ రవితేజ ఇమేజ్ కు సెట్ కాలేదు. అయితే లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ తెర మీదకు వచ్చింది.
రవితేజ ఎనర్జీకి తగ్గట్టు 'నేల టికెట్' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తన గత రెండు సినిమాలకు విభిన్నమైన టైటిల్స్ పెట్టాడు. అలానే రవితేజకి ఈ టైటిల్ సూట్ అవుతుందని భావించి ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ టైటిల్ పై అధికార ప్రకటన రావాల్సివుంది.