Advertisementt

2018 లో చూపిస్తాడు దేవిశ్రీ ప్రతాపం ఏంటో..?

Mon 25th Dec 2017 02:31 PM
devi sri prasad,shows,stamina,2018,rangasthalam,bharath ane nenu movies  2018 లో చూపిస్తాడు దేవిశ్రీ ప్రతాపం ఏంటో..?
Devisri Two Top Movies Release in 2018 2018 లో చూపిస్తాడు దేవిశ్రీ ప్రతాపం ఏంటో..?
Advertisement
Ads by CJ

ఈ మధ్య దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ వింటుంటే.. ఈ సాంగ్ ఎక్కడో విన్నట్టు ఉంది అని అనిపిస్తుంది. గత అయిదు ఆరు సినిమాల నుండి ఇదే జరుగుతుంది. కొట్టిన పాటే ట్యూన్లని తిప్పి తిప్పి మళ్ళీ అదే పాట కంపోజ్ చేస్తున్నాడు. గతంతో పోల్చుకుంటే దేవిశ్రీ ఈ మధ్య అంత ఫామ్ లో లేనట్టు కనపడుతున్నాడు.

వచ్చే ఏడాది దేవికి కీలకం కానుంది. రెండు భారీ సినిమాలకి దేవినే మ్యూజిక్  డైరెక్టర్. ఒకటి 'రంగస్థలం', రెండోది 'భరత్‌ అనే నేను' చిత్రాలకి పని చేస్తున్నాడు. మరి ఆ చిత్రాలకి కూడా ఇప్పటిలానే బ్యాడ్ మ్యూజిక్ ఇస్తే మాత్రం తెలుగులో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ పేరు పోయే అవకాశముంది.

సుకుమార్ - దేవి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్. మరి రంగస్థలం సినిమాకు అదే హిట్ ను కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి. రంగస్థలం అన్ని విధాలా డిఫరెంట్‌ సినిమా కనుక దీంతో దేవి అసలు టచ్‌లో వున్నాడా లేదా అనేది తేలిపోతుంది.

Devisri Two Top Movies Release in 2018:

Devisri Prasad Shows His Stamina in 2018

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ