Advertisementt

డిసెంబర్ 31కి తమన్నాని బుక్ చేసుకున్నారు!

Mon 25th Dec 2017 02:24 PM
heroine tamanna,31st night,treat,guntur,people  డిసెంబర్ 31కి తమన్నాని బుక్ చేసుకున్నారు!
Tamanna dec 31st Night at Guntur డిసెంబర్ 31కి తమన్నాని బుక్ చేసుకున్నారు!
Advertisement
Ads by CJ

ప్రతి ఏడు డిసెంబర్ 31 వస్తుందంటే చాలు.. సినీ తారల హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక సెలబ్రిటీస్ తో హల్చల్ చేయటానికి పబ్స్, రిసార్టులు ఇలా అన్ని రెడీ అయిపోతాయి. ముఖ్యంగా హీరోయిన్స్ తో డాన్స్ చేయించడానికి చాలామంది ముందు నుండే వారిని బుక్ చేసుకుంటారు. అందులో భాగంగా ఇప్పుడు సౌత్ భామ తమన్నా ఓ భారీ డీల్ సెట్ చేసుకుంది.

డిసెంబర్ 31న డాన్స్ వేయటానికి భారీ మొత్తం తీసుకుంది మిల్కీ బ్యూటీ. అయితే తమన్నా ఆడిపాడేది ముంబయిలో కాదు, హైదరాబాద్ లో కూడా కాదు. గుంటూరులోని ఓ రిసార్ట్ లో ఆమె చిందేయనుంది. ఇక తమన్నాకి బయట నుండి చాలా ఆఫర్స్ వచ్చినప్పటికి గుంటూరు నుంచి వచ్చిన ఆఫర్.... బాగా భారీగా ఉండటంతో ఓకే చేసిందంట ఈ అమ్మడు.

ఇక జై లవకుశ ఐటెం సాంగ్ టైంలోనే...ఐటెంసాంగ్స్, డాన్స్ షోలు కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే అని ప్రకటించింది తమన్నా. అందుకే ఏం ఆలోచించకుండా ఈ 31 రాత్రి డాన్స్ చేసే ఆఫర్ కి ఓకే చేసినట్టుంది. ప్రస్తుతం తమన్నా తెలుగులో 3  సినిమాలు చేస్తోంది. సందీప్ కిషన్ సినిమాలో, క్వీన్ రీమేక్ తో పాటు కళ్యాణ్ రామ్ సినిమాలో కూడా నటిస్తుంది.

Tamanna dec 31st Night at Guntur:

Heroine Tamanna 31st Night Treat to Guntur People

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ