నేచురల్ స్టార్ నాని.. హీరో సిద్దార్థ్ మంచి స్నేహితులు అని తెలిసిందే. ఒకప్పుడు సిద్దార్థ్ తెలుగులో హల్చల్ చేసి కోలీవుడ్ కి వెళ్ళిపోయాడు. రీసెంట్ గా విడుదలైన సిద్దార్థ్ సినిమా 'గృహం' తెలుగులో ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చాడు. ఈ సినిమా ట్రైలర్ నానితో లాంచ్ చేయించాడు.
నాని నిర్మాణంలో ‘అ’ సినిమా రాబోతుంది. ఈ సినిమాపై సిద్ధు ట్విట్టర్లో సరదాగా స్పందించాడు. వీళ్లిద్దరి మధ్య సాగిన సంభాషణ ఆసక్తిని కలిగించింది. ముందుగా నాని ఈ చిత్రంలో తాను వాయిస్ ఓవర్ ఇస్తున్న చేప పాత్రని పరిచయం చేస్తూ.. 'నా తర్వాత సినిమా పాత్ర కోసం స్విమ్మింగ్ కూడా నేర్చుకుంటున్నా..' అని ట్వీట్ చేశాడు. దీనిపై సిద్దార్థ్ స్పందిస్తూ.. 'ఈ సినిమా స్క్రిప్ట్ - బృందం గురించి గొప్ప విషయాలు విన్నాను. తొందరగా సినిమా విడుదల చేయి సోదరా'.. అన్నాడు.
అయితే సిద్దార్థ్ ట్వీట్ పై.. 'ఓ అభిమాని..ఈ సినిమాలో మీరు కూడా నటిస్తున్నారా..' అని అడిగాడు. దానికి బదులుగా సిద్ధు.. 'నేనూ చేయాలనే అనుకున్నా.. కానీ ఆ నిర్మాత వేస్ట్ ఫెలో. నన్ను రిజెక్ట్ చేశాడు..' అని చమత్కరించాడు. దీనిపై నాని ఏమీ స్పందించలేదు. మరి దీనిపై నాని ఎలా పంచ్ వేస్తాడో చూడాలి.