తాను నటించే పాత్రలు, తన నిజజీవితం.. ఇలా ప్రతి విషయంలోనూ వివాదాలలో ఉండే నటి అమలాపాల్. ఇక ఈమె సుచీలీక్స్ నుంచి ధనుష్‌తో ఎఫైర్ వరకు... చివరకు రజనీ చేత తిట్టించుకున్నంత పని చేసింది. ప్రేమించానని పెళ్లి చేసుకున్న దర్శకుడు ఎ.ఎల్.విజయ్‌కి కేవలం కొద్దిరోజుల్లోనే విడాకులిచ్చి మరలా నటిగా బిజీ అయింది. పెళ్లయిన వారికి సాధారణంగా పెద్దగా అవకాశాలు రావు. మరీ ముఖ్యంగా ఫిల్మ్‌మేకర్స్ వారికి పెద్దగా గ్లామర్ ఛాన్స్‌లు ఇవ్వరు. కానీ ఈ విషయంలో అమలాపాల్‌ది మాత్రం డిఫరెంట్ స్టైల్. పెళ్లయి విడాకులయిన తర్వాతనే ఆమె తన గ్లామర్‌డోస్‌ని మరింత పెంచింది. త్వరలో తాను బాగా గ్లామర్‌షో చేసిన బాబీ సింహతో నటించిన చిత్రం 'దొంగోడొచ్చాడు' పేరుతో తెలుగులో విడుదలకు సిద్దమవుతోంది.
ఇక ఈమె ఇటీవల ఓ బెంజ్ కారుని ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు పుదుచ్చేరిలో కొన్నట్లు ఫోర్జరీ పత్రాలను చూపించి ప్రభుత్వాన్ని మోసం చేసిన ఘటన సంచలనం సృష్టించింది. దీంతో ఎంతో నిజాయితీ కలిగిన అధికారిగా పేరున్న పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ దీనిపై విచారణకు ఆదేశించింది. మరో వైపు తాను భారతీయురాలినని, జీఎస్టీ ప్రవేశపెట్టిన దేశంలో ఎక్కడైనా తనకు కారు కొనే హక్కు ఉందని అమలా వాదిస్తోంది. ఇక ఈ కేసు ఇప్పుడు కేేరళ హైకోర్టుకి చేరింది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కారుని కొన్ని నకిలీ అడ్రస్ పత్రాలు సమర్పించిన విషయంలో ఆమెపై జారీ అయిన అరెస్ట్ వారెంట్‌కి ముందుగా బెయిల్ తీసుకునే పనిలో ఆమె ఉంది.
మరోవైపు తనకు పుదుచ్చేరిలో కూడా ఇల్లు ఉందనే కొత్త వాదనను ఈమె తెస్తోంది. కానీ ఈ పుదుచ్చేరిలో ఆమె చెప్పుకుంటున్న సొంత ఇల్లు కేవలం ఒకే గది అని, అది నివాస యోగ్యమైన ప్రాంతం కాదని తెలుస్తోంది. కేవలం ఈ కారుతో పాటు భవిష్యత్తు అవసరాల కోసమే ఆమె నామమాత్రంగా ఆ గదిని అద్దెకు తీసుకుందనే వాదన వినిపిస్తోంది. మరి ఈ విషయంలో విజయం అమలాని వరిస్తుందా? లేదా? ప్రభుత్వ అధికారుల ఆరోపణలు న్యాయస్థానం ఎదుట నిలుస్తాయా? అనేది వేచిచూడాల్సివుంది...!