నాగార్జున మంచి ప్రొడ్యూసర్ మాత్రమే కాదు..మంచి తండ్రి కూడా. అందుకే తన ఇద్దరి కొడుకుల భవిష్యత్తు తానే స్వయంగా దగ్గర ఉండి చూసుకుంటున్నాడు. నాగార్జునకి మంచి హిట్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ తో రారండోయ్ వేడుక చూద్దాం సినిమాను చైతన్య కోసం చేయించాడు. అలానే అక్కినేని ఫ్యామిలీకి మెమరబుల్ హిట్ ఇచ్చిన విక్రమ్ కె కుమార్ తో అఖిల్ కు ఓ సినిమా చేయించాడు. చైతు కెరీర్ గాడిలో పడింది. చందు మొండేటితో ఒకటి, మారుతితో మరొకటి రెండు సినిమాలు చేస్తున్నాడు.
అఖిల్ సినిమా హలో రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది. మరి అఖిల్ తర్వాత సినిమా ఏంటి? ఎప్పుడు? అని అందరిలో ఓ క్యూరియాసిటీ ఏర్పడింది. అయితే అఖిల్ నెక్స్ట్ మూవీ కోసం కొరటాలశివ, సుకుమార్ ను రెడీగా పెట్టాడంట నాగ్. అయితే కొరటాలశివ విషయంలో క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం కొరటాల శివ మహేష్ తో భరత్ అనే నేను సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేయనున్నాడు. కానీ ఈ సినిమా ఎప్పుడు చేస్తాడో తెలియదు.
మరోవైపు ప్రభాస్, బన్నీ కూడా కొరటాల కోసం ట్రై చేస్తున్నారని టాక్. ఇకపోతే సుకుమార్ రంగస్థలం తర్వాత ఏ సినిమాకి కమిట్మెంట్ ఇవ్వలేదు. అందువల్ల అఖిల్ తో సుకుమార్ సినిమా అయితే బాగుంటుందనే ఆలోచన కూడా నాగ్ క్యాంప్ చేస్తోందని వినికిడి.