నిన్నటివరకు సినిమా ఛాన్స్‌లు రాని యువతకు తమ మనోభావాలు తెలిపి, తమ టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవడానికి సోషల్‌మీడియా, అందులోనూ వెబ్‌సిరీస్‌లు, షార్ట్ ఫిలింస్ ఉపయోగపడేవి. కానీ అవి ఉన్నట్లుండి సినిమాలతో వైఫల్యాలు పొందుతూ, ఎంత సంచలనం సృష్టిద్దామని కోరుకున్నా కూడా సెన్సార్ కత్తెరలు ఉండే సరికి ఈ వికృత స్వభావం కలిగిన దర్శకులకు ఇవి మరో ఆప్షన్స్‌గా మారాయేమో అనిపిస్తోంది. సినిమాలలో చూపించలేకపోయిన విశృంఖలాలనే వెబ్‌సిరీస్‌లుగా తీస్తున్నానని, తన 'కడప' వెబ్‌సీరిస్ పూర్తిగా రక్తపాతంతో నిండి ఉంటుందని, ఇష్టం ఉంటే చూస్తారు. లేకపోతే మానేయండి అని వర్మ సెలవివ్వడమే కాదు.. తన తదుపరి వెబ్‌సిరీస్ ముందు 'కడప' కేవలం ఓ కుటుంబకథ వంటిదని తేల్చిచెప్పాడు.
ఇక ఈ మధ్య షార్ట్‌ఫిల్మ్ నేపధ్యంలో ఓ మహిళను నగ్నంగా చూపించి వర్మ సృష్టించిన సంచలనం అలాంటి ఇలాంటిది కాదు. ఇప్పుడు ఆయన రూట్‌లోనే ఆయన ప్రియ శిష్యుడైన పూరీ జగన్నాథ్ కూడా వెళ్తున్నాడా? అనే అనుమానం వస్తోంది. 'టెంపర్' తర్వాత 'ఇజం, రోగ్, లోఫర్, పైసా వసూల్, జ్యోతిలక్ష్మి'ఇలా వరుస డిజాస్టర్లు పూరీని వరిస్తున్నాయి. ఇక సినిమా అంటే కోట్లతో కూడిన వ్యవహారం. తనను నమ్మి ఏ నిర్మాత ముందుకు రాని పరిస్థితి. దాంతో తన కుమారుడు ఆకాష్‌పూరీనీ హీరోగా నిలబెట్టేందుకు తానే ముందుకు వచ్చి 'మెహబూబా' తీస్తున్నాడు. ఈ చిత్రం పూరీకి ఉన్న బ్యాడ్ మార్కెట్ వల్ల పెద్దగా ఆసక్తినిగానీ, బిజినెస్‌ని కానీ సాధించే అవకాశాలు కనిపించడం లేదు. దాంతో 'మెహబూబా' రిలీజ్‌కి ముందే ఏదో ఒక సంచలనంతో పూరీ వార్తల్లో నిలువడానికి ట్రై చేస్తున్నట్లు ఉంది. డిసెంబర్ 31 రాత్రిన ఆయన తన షార్ట్ ఫిల్మ్‌ని విడుదల చేస్తున్నాడు.
ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ని పూరీ విడుదల చేశాడు. చుట్టూ పచ్చటి చెట్లు, అడవుల్లో ఓ చెట్టుని ఓ మహిళ దిగంబరంగా కౌగిలించుకుంటున్న స్టిల్‌ని చూపి దీనికి 'హగ్' అనే టైటిల్ పెట్టాడు. మరి పూరీ కూడా దీనిలో వికృతం చూపిస్తాడా? లేక ప్రకృతి, పర్యావరణ రక్షణ పేరుతో ఏదైనా మంచి మెసేజ్ ఇస్తాడా? అనేది వేచిచూడాలి. ఇక దీనికి సందీప్‌చౌతా సంగీతం అందిస్తున్నాడు.