తన ఫ్యాన్స్ కు తన సినిమా ద్వారా ఏదొక ట్రీట్ ఇవ్వాలి అని చూస్తుంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. కొరటాల శివ డైరెక్ట్ చేసిన శ్రీమంతుడు సినిమాతో అతడి కెరీర్ లో ఓ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు మహేష్. ప్రస్తుతం వరస పరాజయాలతో ఉన్న మహేష్ తన అభిమానుల్లో జోష్ నింపేలా ప్రస్తుతం తీస్తున్న ‘భరత్ అనే నేను’ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉండేలా చూస్తున్నాడు.
శ్రీమంతుడు సినిమాలో ఓ పాటలో మహేష్ లుంగీలో కనిపించాడు. ఆ లుక్ అభిమానులకు తెగ నచ్చడంతో...అదే తరహాలో ఇప్పుడు తీస్తున్న భరత్ అనే నేనులో ఫ్యాన్స్ కోసం అచ్చ తెలుగు పంచెకట్టుతో ఓ పాట తీయాలని డైరెక్టర్ కొరటాల శివ ఆలోచన చేస్తున్నాడట. అంతకు ముందు పోకిరి, శ్రీమంతుడు సినిమాల్లో లుంగీలో కనపడ్డాడు మహేష్. తొలిసారిగా పంచెకట్టుతో కనపడనున్నాడు ‘భరత్ అనే నేను’ సినిమాలో.
అయితే ఇక ఈ ప్రపోజల్ దాకా వెళ్లలేదని..కొరటాల శివకు ఫిలిం మేకర్లకు తప్ప ఎవరికి తెలీదని సినిమా యూనిట్ సభ్యుడొకరు తెలిపారు. ఇక భరత్ అనే నేను సినిమాలో మహేష్ కెరీర్ లో మొదటి సారి ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడు అని తెలిసిన విషయమే. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదలకు సిద్ధం అవుతుంది.