పేరుకి పెద్ద మెగా కాంపౌండ్ హీరో.. మరో వైపు ఆయన సోదరుడు అల్లుఅర్జున్ స్టైలిష్ స్టార్‌గా దూసుకెళ్తూ, యావరేజ్ చిత్రాలను కూడా బ్లాక్‌బస్టర్స్‌గా మార్చేస్తున్నాడు. తండ్రి నిర్మాణంలో, కథలు, దర్శకులు ఇతర విషయాల ఎంపికలో గొప్పవ్యక్తి . అయినా కూడా అల్లుఅరవింద్ గారి చిన్నబ్బాయ్ అల్లు శిరీష్‌కు పెద్ద హిట్ లేదు. ఏదో 'శ్రీరస్తు-శుభమస్తు' మాత్రమే ఫర్వాలేదనిపించింది. ఇక మలయాళంలో ఓ చిత్రం చేసినా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ఈనెల 28న విడుదలకు సిద్దమవుతున్న 'ఒక్క క్షణం' చిత్రం అల్లుశిరీష్‌కి లైఫ్ అండ్ డెత్‌గా మారింది. అందునా నిఖిల్ హీరోగా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రంతో సెన్సేషన్ సృష్టించిన విఐ ఆనంద్ దర్శకుడు.
ఇక ఈ చిత్రం టీజర్ ఆ మధ్య విడుదలైంది. రెండు జంట జీవితాలలో ఒకే తరహా సంఘటనలు జరగడం అనే పాయింట్ మీద ఈ చిత్రం ఉన్నట్లు అర్ధమవుతోంది. ఇక ఇదో థ్రిల్లర్ మూవీ అని అందరూ భావించారు. ఇక టీజర్‌లో అల్లుశిరీష్ 'నేను ప్రేమించిన అమ్మాయి ప్రాణాల మీదకు వస్తే ఫేట్‌తోనైనా, డెస్టినీతోనైనా, చివరకు చావుతోనైనా పోరాడుతా' అని డైలాగ్ చెప్పాడు. ఈ చిత్రానికి లవ్ వర్సెస్ డెస్టినీ అనేది ఉప శీర్షిక కావడంతో ఈ చిత్రంపై మరింత అంచనాలు పెరిగాయి.
తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని కూడా రిలీజ్ చేశారు. ఇందులో అల్లుశిరీష్ సురభిల మధ్య లవ్ కెమిస్ట్రీని చూపించగా మరో వైపు అవసరాల శ్రీనివాస్, అతడిని వశపరుచుకునే పాత్రలో సీరత్‌కపూర్‌లు కనిపించారు. సో.. ఈ చిత్రం ఈ రెండు జంటల మధ్య జరిగే సంఘటనలకు, సైన్స్‌ని మిక్స్ చేసి, అగ్గిపుల్ల థియరీతో సాగే థ్రిల్లర్‌గానే గాక ఇందులో లవ్ యాంగిల్‌కూడా ఉందని అర్ధమవుతోంది. ఈ ట్రైలర్‌కి ప్రధాన ఆకర్షణ స్వరబ్రహ్మ మణిశర్మ అందించిన బీజీఎం. ఇదే మణిశర్మకి చివరి చిత్రం అని కొందరు అంటున్నారు. ఇన్ని విశేషాల మధ్య విడుదలవుతున్న 'ఒక్కక్షణం' అయినా శిరీష్‌కి ఒక్క హిట్‌ని ఇస్తుందేమో వేచిచూడాల్సివుంది!