బాలకృష్ణ సినిమా అంటే చాలు ఓ పవర్‌ఫుల్ టైటిల్, ఓ పది పంచ్ డైలాగులు, ఇరగదీసే, తన ఫ్యామిలీ, తన తండ్రి గురించి గొప్పగా చెప్పే ఓ పది డైలాగులు, ఐదారు మాస్ ఫైట్స్, పాటలు ఉంటే అదే ఆయన చిత్రం అని చెప్పుకోవాలి. అందుకే కొందరు సెట్టింగుల పేరు చెబితే మహేష్‌బాబు సినిమాకి డేట్స్ ఇస్తాడు.. పది పవర్‌పుల్ డైలాగ్స్, మరో పవర్‌పుట్ టైటిల్ చెబితే చాలు బాలయ్య ఓకే అంటాడనే జోకులు ఇండస్ట్రీలో పేలుతూనే ఉంటాయి. ఇక అమావాస్యకో, పౌర్ణమికో అన్న తరహాలో వచ్చే 'భైరవద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం, ఆదిత్య 369, శ్రీరామరాజ్యం, గౌతమీ పుత్ర శాతకర్ణి'లు తప్ప బాలయ్య చిత్రాలలో చెప్పుకోవడానికి ఏమున్నది గర్వకారణం అని చెప్పవచ్చు.
ఇక ఆయనకు అలాంటి రొటీన్ సబ్జెక్ట్స్‌తో కూడా 'సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా, లెజెండ్' వంటి హిట్స్ రావడంతో ఆయన ఆ దారిని వదిలే ప్రసక్తే లేదని తాజాగా విదుడలైన 'జై సింహా' టీజర్ చూస్తేనే అర్ధమవుతుంది. రొటీన్‌కే రొటీన్ అనిపించే టీజర్‌గా దీనిని చెప్పుకోవచ్చు. ఇక 'సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహ, సింహా' వంటి సింహా టైటిల్స్ కలుసోస్తున్నాయనే భ్రమలోనే బాలయ్య ఈ చిత్రానికి 'జై సింహా' అనే టైటిల్‌ని పెట్టి, తమిళులే పట్టించుకోని కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం చేస్తుండటం విశేషం. గతంలో పి.వాసుని నమ్ముకుని 'మహారధి' ఇప్పుడు కె.యస్.రవికుమార్‌ని నమ్ముకుని 'జై సింహా' ఇలా ఉంది బాలయ్య వరస.
ఇక ఈ టీజర్‌లో కూడా బాలయ్య లుక్ సాదాసీదాగా ఉంది. చివర్లో కత్తి విసిరే గెటప్ మాత్రం ఓకే. ఇక ఇందులో ఆయన 'సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు. సైలెంట్‌గా ఉందని కెలికితే తల కొరిస్తది' డైలాగ్ వింటే పవన్ చెప్పే 'సింహం.. గడ్డం' వంటి పాత రొటీన్ డైలాగ్సే గుర్తుకు వస్తున్నాయి. ఏది ఏమైనా తాజాగా విడుదలైన టీజర్ ఏమాత్రం కొత్తదనం లేకుండా సాదాసీదాగా ఉంది. ఇక నయనతార, నటాషాదోషి, హరిప్రియలు నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. కేవలం సంక్రాంతి, సింహా సెంటిమెంట్లనే నమ్ముకుంటే మరో 'పైసా వసూల్' వస్తుందేగానీ విజయం రాదని బాలయ్య తెలుసుకోవాలి.