Advertisementt

మరోసారి టాలీవుడ్ లో డ్రగ్స్ ప్రకంపనలు!

Fri 22nd Dec 2017 06:56 PM
tollywood,drugs,scandal,sit ready,arrest  మరోసారి టాలీవుడ్ లో డ్రగ్స్ ప్రకంపనలు!
Tollywood Drugs Scandal - SIT Ready To Arrest మరోసారి టాలీవుడ్ లో డ్రగ్స్ ప్రకంపనలు!
Advertisement
Ads by CJ

సెప్టెంబర్ నెలలో టాలీవుడ్ ని ఒక కుదుపు కుదిపిన డ్రగ్స్ కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. దాదాపు రెండు నెలల పాటు మీడియా మొత్తం ఈ డ్రగ్స్ కేసు మీదే ఫోకస్ పెట్టింది. మినిట్ టు మినిట్ ఈ కేసు గురించిన న్యూస్ లే మీడియా ప్రముఖంగా ప్రచురించింది. అయితే దాదాపు రెండు నెలల పాటు హాట్ టాపిక్ అయిన ఈ కేసు ఈమధ్యవరకు సైలెంట్ అవడంతో.. ఇక ఈ కేసు మరుగున పడి ఇండస్ట్రీలోని పెద్దలు, బడా నేతలు తప్పించుకున్నారని.. అందరూ అనుకున్నారు. అయితే మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ కేసు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించడానికి రెడీ అయ్యింది.

దాదాపు 12 మంది సినీ ప్రముఖులను ఈ డ్రగ్స్ కేసులో విచారించిన సిట్ అధికారులు వారిలో ఎవరు డ్రగ్స్ సేవించారనే విషయాన్నీ మాత్రం ఇప్పటి వరకు బయటపెట్టలేదు. వారిలో కొంతమంది తమ బ్లడ్ శాంపిల్స్ ఇవ్వగా మరికొందరు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించారు. అయితే ఆ 12 మందిని విచారించిన సిట్ అధికారులకు వారిలో కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఫైల్ తయారు చేశారనే టాక్ బయటికి వచ్చింది. సిట్ అధికారులు ఈ కేసు విషయమై సంచలన నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. డ్రగ్స్ కేసులో పలువురి ప్రముఖుల అరెస్టులు ఉంటాయన్న లీకులు బయటకు వస్తున్నాయి.

మరి ఆ 12  మందే కాకూండా ఇంకొంతమందిని సిట్ అధికారులు విచారణ చేపడతారని టాక్ కూడా వినిపించడమే కాదు.. ఈసారి అరెస్టుల పర్వం మొదలు కాబోతుందని.. ఆ 12 మందిలో కొంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ లీకులిస్తున్నారు. మరి మరొకసారి ఈ డ్రగ్స్ కేసు మీడియాలో హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉందంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో అనేది.

Tollywood Drugs Scandal - SIT Ready To Arrest:

Tollywood In Drugs Scandal Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ