Advertisementt

దేవిశ్రీ అయితే 'అజ్ఞాతవాసి' మరోలా ఉండేది!!

Fri 22nd Dec 2017 02:16 PM
pawan kalyan,agnathavasi,audio songs,anirudh,devisri prasad,trivikram,pawan kalyan fans  దేవిశ్రీ అయితే 'అజ్ఞాతవాసి' మరోలా ఉండేది!!
Audience Talk about Agnathavasi Audio Songs దేవిశ్రీ అయితే 'అజ్ఞాతవాసి' మరోలా ఉండేది!!
Advertisement
Ads by CJ

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మూడోసారి నటిస్తున్న అజ్ఞాతవాసి విడుదలకు రంగం సిద్ధం చేస్తుంది చిత్ర బృందం. ఇప్పటికే పాటలు మార్కెట్ లోకి వచ్చేశాయి. అలాగే అజ్ఞాతవాసి టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తుంది. ఇకపోతే అజ్ఞాతవాసి ఆడియో వేడుకతో అజ్ఞాతవాసి పాటలన్ని మార్కెట్ లోకి వచ్చేశాయి. ఒక్క పవన్ కళ్యాణ్ హమ్ చేసిన సాంగ్ తప్ప.  కొడుకా కోటేశ్వర్ రావా అంటూ సాగే ఈ మాస్ బీట్ స్పెషల్ అట్రాక్షన్ గా అజ్ఞాతవాసికి నిలవనుంది అంటున్నారు.

ఇక ఆ పాటను 2017 ఎండింగ్ అంటే డిసెంబర్ 31న విడుదల చెయ్యబోతున్నట్టుగా ప్రకటించారు. అయితే అజ్ఞాతవాసి ఆల్బంలో మొదటి రెండు పాటలు విన్నప్పుడు అనిరుద్ మిగిలినవి ఇంకే రేంజ్ లో కంపోజ్ చేసుంటాడా అని ఫ్యాన్స్ రకరకాలుగా ఊహించుకున్నారు. కాని అజ్ఞాతవాసి ఇంట్రో సాంగ్ ఆశించినంత మేర లేకపోవడం (లిరిక్స్ అదిరిపోయినా)... చివరి పాట అయితే అసలు అర్థమయ్యి కానట్టు గజిబిజిగా ఉండటం పవన్ కళ్యాణ్ అభిమానులను విపరీతంగా నిరాశపరిచింది అనే కామెంట్స్ పడుతున్నాయి.

గాలి వాలుగా, బయటికొచ్చి చూస్తే పాటలు తప్ప అజ్ఞాతవాసిలో మిగిలినవి అంత కిక్ ఇచ్చే పాటలుగా అనిపించడం లేదని కొందరు పవన్ ఫాన్స్ నిజాయితీగా ఒప్పుకుంటున్నారు. అందుకే అజ్ఞాతవాసిలో దేవి శ్రీ ప్రసాద్ లేని లోటు స్పష్టంగా ఆల్బంలో కనిపిస్తుందని ఓపెన్ గానే అంటున్నారు కొంతమంది. అయితే త్రివిక్రమ్ మాత్రం అనిరుద్ కొలెవరి ఢీ కి బాగా కనెక్ట్ అయ్యి ఇలా గుడ్డిగా పవన్ 25 వ సినిమా కోసం తీసుకొచ్చాడని అంటున్నారు. కొలెవరి పాటతో కోట్లాది అభిమానులను ప్రపంచవ్యాప్తంగా సంపాదించుకున్నాడు అనిరుద్. అందుకే పవన్ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నాడు అనగానే అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. కాని ఇవి అంత గొప్పగా ఏమి లేవని ఇప్పుడంటున్నారు. మరి చూద్దాం సినిమా విడుదలయ్యాక అజ్ఞాతవాసికి మ్యూజిక్ మైనస్సా లేదా అనేది.

Audience Talk about Agnathavasi Audio Songs:

Agnathavasi songs Disappoints Pawan Kalyan Fans also 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ