Advertisementt

చరణ్.. రాజమౌళి లెక్కని కనిపెట్టేశాడు!

Fri 22nd Dec 2017 02:05 PM
ram charan,ss rajamouli,koratala shiva,boyapati srinu,movie  చరణ్.. రాజమౌళి లెక్కని కనిపెట్టేశాడు!
Ram Charan and Koratala Shiva Movie in 2018 చరణ్.. రాజమౌళి లెక్కని కనిపెట్టేశాడు!
Advertisement
Ads by CJ

సాధారణంగా స్టార్స్‌ అందరికీ ఒక పెద్ద హిట్‌ వచ్చిందంటే తదుపరి చిత్రం విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అదే ఫ్లాప్‌ అయినా కూడా తదుపరి చిత్రం విషయంలో మరిన్ని ముందస్తు కేర్‌ని పాటించాల్సి ఉంటుంది. ఏతావాతా తేలేదేమంటే హిట్‌ వచ్చినా, డిజాస్టర్‌ వచ్చినా ప్రతి చిత్రానికి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక హీరో రామ్‌చరణ్‌ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం సుకుమార్‌తో 'రంగస్థలం' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం విడుదల మార్చి 30 అయినా కూడా షూటింగ్‌ మాత్రం ఈ నెలలోనే పూర్తి కానుంది. 

ఇక జనవరి ఎండింగ్‌లో దానయ్య నిర్మాతగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ పక్కా మాస్‌ యాక్షన్‌ ఓరియంటెండ్‌ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నాడు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత చరణ్‌, ఎన్టీఆర్‌లు రాజమౌళి మల్టీస్టారర్‌కే పరిమితం అవుతారని అందరూ భావించారు. ఇక సినిమాని జాగ్రత్తగా చెక్కడంలోనే కాదు. ముఖ్యంగా భారీ మల్టీస్టారర్‌ కావడంతో జక్కన్న, ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్‌లు ఈ కథను ఒక పట్టాన తేల్చేలా లేరు. ప్రతి విషయంలోనూ ఎన్నో జాగ్త్రతలు తీసుకోవాలి. సో.. జక్కన్న మల్టీస్టారర్‌ సెట్స్‌పైకి వెళ్లాలంటే ఎంతో సమయం పట్టడం ఖాయం. ఇక జక్కన్న చిత్రం స్టార్ట్‌ అయితే తన చిత్రం పూర్తయ్యే వరకు మరో చిత్రంలో హీరోలను నటించేందుకు ఒప్పుకోడు. జక్కన్న చిత్రం లేటవుతుందనే భరోసా ఉండటంతోనే రామ్‌చరణ్‌, జక్కన్న చిత్రం మొదలయ్యేలోపు కొరటాల శివ చిత్రాన్ని కూడా పూర్తి చేయాలని భావిస్తున్నాడట. 

ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో చిత్రం రెండు సార్లు వాయిదా పడింది. ఈ సారి మాత్రం వాయిదా వేయకుండా ఇటు చరణ్‌ బోయపాటి చిత్రం, అటు కొరటాల 'భరత్‌ అనే నేను' రెండు పూర్తయ్యే సరికి వీరిద్దరు తమ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. అంటే వచ్చే ఏడాది చరణ్‌ 'రంగస్థలం' విడుదలతో పాటు బోయపాటి, కొరటాల, జక్కన్న చిత్రాలతో బిజీ బిజీ కావడం ఖాయం.మరోవైపు నిర్మాతగా 'సై..రా..నరసింహారెడ్డి' ఎలానూ ఉంది. 

Ram Charan and Koratala Shiva Movie in 2018:

Ram Charan Planning on SS Rajamouli Stand

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ