ప్రస్తుతం ఎన్ని చిత్రాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నా కూడా సుకుమార్ వంటి క్రియేటివ్ జీనియస్ డైరెక్షన్‌లో మైత్రి మూవీమేకర్స్ సంస్థ రామ్‌చరణ్, సమంతలతో తీస్తున్న 'రంగస్థలం 1985' మీద అందరికీ బోలెడు ఆసక్తి ఉంది. విడుదలకు ఇంకా దాదాపు 100రోజుల సమయం ఉన్నప్పటికీ ఈ చిత్రం విశేషాలు ఒకొటొక్కటిగా అందరినీ అలరిస్తున్నాయి. ఇక చిట్టిబాబు అనే పల్లెటూరి కుర్రాడిగా, గుబురు గడ్డంతో ఉన్న రామ్‌చరణ్ గెటప్ చూసి ఆయన అభిమానులు ఎంతో ఆనందిస్తున్నారు. పని పిల్లగా, గేదెలు కాచుకునే యువతి పాత్రలో డీ గ్లామరైజ్‌డ్‌గా ఉన్న సమంత లుక్స్ షాక్‌కి గురి చేస్తున్నాయి.
ఇక ఈ చిత్రంలోని ప్రతి సీన్‌ని, కాస్టూమ్స్‌ని, ఇతర ప్రాపర్టీలు, సెట్స్‌ని నాటి కాలానికి అనుగుణంగా సుకుమార్ రూపుదిద్దుతున్న తీరు చూస్తే ఆయన్ను మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్‌గా చెప్పాల్సిందే. ఇక నాటి గ్రామాలలో తప్పెట్లు వాయిస్తూ, గుండెలు ఝల్లుమనేలా గజ్జల సందడి చేసే తప్పెటగుళ్లు అనే కళాకారులు నాడు ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు సుకుమార్ తన 'రంగస్థలం' కోసం వారిని పశ్చిమగోదావరి జిల్లాల నుంచి తీసుకువచ్చి వారితో పాటు కలిసి సాగే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. ఈ షెడ్యూల్ ఈ నెలాఖరు వరకు జరగనుంది.
ఈ సందర్భంగా తాను మరో జానపదకళ అయిన తప్పెటగుళ్లు నాట్యకారులు, వారి ప్రతిభను చూసి ఎంతో నేర్చుకున్నానని రామ్‌చరణ్ అంటున్నాడు. వారితో ఈ చిత్రం సెట్స్‌లో గడపటం, వారి గురించి తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది... అని తెలుపుతూ వారితో తీసుకున్న ఫొటోని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో ప్రస్తుతం అందరినీ విపరీతంగా ఆలరిస్తోంది. మొత్తానికి చిట్టిబాబు పాత్రను చేస్తున్న చరణ్‌కి ఇవ్వన్నీ అదనపు ఆకర్షణలుగా నిలవడం గ్యారంటీ అని చెప్పవచ్చు.