Advertisementt

పవన్ అంటే ఫ్యాన్స్ కి అంత పిచ్చి మరి!

Thu 21st Dec 2017 09:39 PM
pawan kalyan,fans,agnathavasi,audio launch,fan selfie  పవన్ అంటే ఫ్యాన్స్ కి అంత పిచ్చి మరి!
Pawan Kalyan Fan Selfie At Agnathavasi Audio Launch పవన్ అంటే ఫ్యాన్స్ కి అంత పిచ్చి మరి!
Advertisement
Ads by CJ

సినిమా స్టార్స్‌కి క్రేజ్‌, ఇమేజ్‌లు ఎంతగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయా హీరోల కంట్లో పడాలని, కేవలం వారితో కలిసి ఓ సెల్ఫీ తీసుకోవాలనేదే ఇలాంటి వీరాభిమానుల చేష్టలకు కారణం. కొందరు వారిని హద్దు మీరినందుకు కొడితే మరికొందరు మాత్రం వారి చిరుకోరికలను తీర్చి పంపిస్తూ ఉంటారు. ఇక తాజాగా జరిగిన పవన్‌-త్రివిక్రమ్‌ చిత్రం 'అజ్ఞాతవాసి' వేడుక సందర్బంగా యాంకర్‌ సుమ పవన్‌ని స్టేజీ మీదకి పిలవగా, ఆయన నడుచుకుంటే స్టేజీ ఎక్కబోయే సమయంలో ఓ వీరాభిమాని పవన్‌ సెక్యూరిటీ కళ్లు గప్పి పవన్‌ కాళ్లను పట్టుకుని, సాష్టాంగపడి నానా హంగామా సృష్టించాడు.

ఈ షాక్‌ నుంచి తేరుకున్న పవన్‌ సెక్యూరిటి ఆ అభిమానిని ఈడ్చుకెళ్లడం చూసి పవన్‌ మనసు చివుక్కుమంది. వెంటనే ఆయన తన సెక్యూరిటీ వాళ్లని అలా ఈడ్చుకెళ్లవద్దని వారించి, ఆ బక్కపలచటి అభిమానిని పిలిచి ఏం కావాలి ? అని ప్రశ్నించాడు. దానికి ఆ అభిమాని ఓ సెల్ఫీ కావాలని కోరాడు. వెంటనే పవన్‌ ఆ ఫ్యాన్‌తో సెల్ఫీ దిగి పంపి వేశాడు.

ఇలాంటి అభిమానుల వల్ల ఇబ్బందేమీ ఉండదని, కానీ సమయాభావం వల్లనే తాను ప్రతి ఒక్కరిని పేరు పేరునా పిలిచి, వారి కోర్కెలు తీర్చలేకపోతున్నానని చెప్పడంతో ఆడిటోరియం మొత్తం 'పవర్‌స్టార్‌.. పవర్‌స్టార్‌...' అనే నినాదాలతో మార్మోగిపోయింది. ఈ సంఘటన ఈ వేడుకకే హైలైట్‌గా నిలిచింది. ఇక ఇలాంటి సంఘటనలే గతంలో చిరంజీవి, రజనీకాంత్‌ నుంచి ఐఐఎఫ్‌ఏ వేడుకల్లో చియాన్‌ విక్రమ్‌కి కూడా ఎదురుకాగా, ఆయన కూడా పవన్‌ తరహాలోనే ఆ అభిమానితో సెల్ఫీ దిగి పంపించాడు.

Pawan Kalyan Fan Selfie At Agnathavasi Audio Launch:

Pawan Kalyan Speech About Fans At Agnathavasi Audio Launch 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ