అక్కినేని కోడలిగా అడుగుపెట్టిన సమంత ఇప్పుడు అటు కుటుంబానికి ఇటు కెరీర్ కి ఇంపార్టెన్స్ బాగానే ఇస్తున్నట్టుగా కనబడుతుంది. అంతేకాదు అక్కినేని ఈవెంట్స్ కి ఎంతో పద్దతిగా దర్శనమిస్తుంది. ఎప్పుడు హాట్ హాట్ గా కనబడే సమంత, నాగ చైతన్యతో పెళ్లి తర్వాత కూడా ఏం మారలేదు. అంతే హాట్ గా తయారైంది. ఒకపక్క తాను చేస్తున్న సినిమాల షూటింగ్స్ కి హాజరవుతున్న సమంత కి వర్క్ విషయంలో వంక పెట్టేవాళ్లే లేరు. అయితే అక్కినేని కోడలిగా అడుగుపెట్టిన సామ్ కొద్దిగా మారినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే... ప్రస్తుతం సామ్ చేస్తున్న సినిమాలు తెలుగులో ఒకటి రంగస్థలం కాగా మరొకటి మహానటి.
అయితే రంగస్థలం సినిమాలో సమంత, రామ్ చరణ్ సరసన సుకుమార్ దర్శకత్వంలో నటిస్తుంది. అయితే రంగస్థలం కథ ప్రకారం చరణ్ తో ఒక ఘాటైన ముద్దు సీన్ ఒకటి ఉందట. కానీ సమంత మాత్రం వద్దు అని నిర్మొహమాటంగా చెప్పిందని టాక్. సీన్ కు ఆ లిప్ లాక్ కిస్ నిజంగా అవసరమే అయినా కూడా తాను చేయలేను అని సమంత చెప్పేసింది అంటున్నారు. పెళ్లి తర్వాత ఇలాంటి వాటిలో నటించడం కాస్త ఇబ్బందిగా ఉంటుందని.. అందుకే అలాంటి సీన్స్ లో యాక్ట్ చేయలేనని సమంత చెప్పినట్టుగా వార్తలొస్తున్నాయి.
అయితే సమంత అలా లిప్ లాక్ కిస్ కి దూరం అని చెప్పడంతో ఇటు అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఫీలవుతున్నారు. పెళ్లి కాకముందు వరకు సినిమాల్లో ఎలా ఉన్నా ఏం చేసినా చెల్లుతుంది కాని ఒక పెద్ద కుటుంబానికి కోడలయ్యాక మాత్రం పద్దతులు మార్చుకోవాలి అని సమంత మరోసారి ఋజువు చేసిందంటు అక్కినేని ఫ్యాన్స్ ఖుషీగా వున్నారు. మరి సమంత ఆ ముద్దు సీన్ కి నిజంగా చేయలేనని చెప్పిందో లేదో గాని.. ఇప్పుడు ఈ హాట్ న్యూస్ వలన సమంతకి రాబోయే ఛాన్స్ లు ఎలా వుంటాయో.. అక్కినేని కొత్త కోడలు చెప్పే కండిషన్స్ కి దర్శక నిర్మాతలు ఎలా ఫీల్ అవుతారో అనేది కాస్త ఆసక్తిని కలిగించే విషయమే.