'హలో' చిత్రం గురించి చెప్పాలంటే ముందుగా ఈ చిత్రానికి హీరో అయిన దర్శకుడు విక్రమ్ కె.కుమార్ గురించి చెప్పాలి. ఇవాళ నాకు ఎంతో ఆనందంగా ఉంది. విక్రమ్ నాడు 'మనం' ఇచ్చాడు. ఇప్పుడు 'హలో' ఇచ్చాడు. ఈ చిత్రం వేడుకకి వచ్చి అఖిల్‌ని ఆశీర్వదించాలని నేను కోరగానే చిరంజీవిగారు ఓకే చెప్పారు. ముందుగా సినిమా చూసిన తర్వాతే మాట్లాడమని చెప్పాను. ఇక నాకంటే చిరంజీవి పెద్దవారు. అఖిల్ కంటే రామ్‌చరణ్ పెద్దవాడు. వారిద్దరి మధ్య ఇంత క్లోజ్ ఫ్రెండ్‌షిప్ ఉందని నాకు తెలియదు. ఈ చిత్రానికి మంచి మంచి టెక్నీషియన్స్ పనిచేశారు. ఇక సమంత వచ్చిన తర్వాత మా ఇళ్లు కళకళలాడుతోంది. అఖిల్‌ని చూస్తే కడుపు నిండిపోయింది.. అని హలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు.
నాగచైతన్య మాట్లాడుతూ.. అఖిల్ డ్యాన్స్‌లు బాగా చేస్తాడు. ఫైట్స్ బాగా చేస్తాడు. కానీ వాడిని ఫీల్‌గుడ్ చిత్రంలో చూడాలనేది నా కోరిక. ఆ కోరిక ఈ చిత్రంతో నెరవేరింది. ఈ సినిమా చూసిన తర్వాత మీరు కూడా అదేఅంటారు.. అని చెప్పుకొచ్చాడు.
ఇక రామ్‌చరణ్ మాట్లాడుతూ.. నాన్నగారు ఈ రోజు సినిమా చూశారు. లంచ్ బ్రేక్‌లో ఈ చిత్రం గురించి నాతో మాట్లాడారు. సినిమా చూశాక నేను కూడా మీలా ఎంజాయ్ చేస్తాను. పెద్ద పెద్ద టెక్నీషియన్స్ పనిచేసిన ఈ చిత్రం తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది.. అన్నాడు.
ఇక సమంత మాట్లాడుతూ.. మా మద్య ఉన్న నిజమైన అఖిల్‌ని వెండితెరపై చూపిస్తున్న విక్రమ్ కె.కుమార్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూస్తే నిజమైన అఖిల్ కనిపిస్తున్నాడని ఆనందం వ్యక్తం చేసింది. మరి ఈ చిత్రం రేపు (డిసెంబర్ 22) విడుదలై అఖిల్‌కి, నాగ్‌కి ఎంతటి హిట్‌ని ఇస్తుందో వేచిచూడాల్సివుంది....!