Advertisementt

'అజ్ఞాతవాసి' రన్ టైమ్ ఎంతో తెలుసా?

Thu 21st Dec 2017 06:52 PM
trivikram srinivas,pawan kalyan,run time,agnathavasi movie  'అజ్ఞాతవాసి' రన్ టైమ్ ఎంతో తెలుసా?
Gossips on Agnathavasi Movie Run Time 'అజ్ఞాతవాసి' రన్ టైమ్ ఎంతో తెలుసా?
Advertisement
Ads by CJ

 

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కలయికలో వస్తున్న అజ్ఞాతవాసి సినిమా మీద అంచనాలను కొలమానంలో కొలవడం చాలా కష్టం. ఆ రేంజ్ లో అజ్ఞాతవాసి మీద అంచనాలున్నాయి. వారిరువురి కాంబోలో వస్తున్న ఈ సినిమా మీద సాధారణ ప్రేక్షకుడికి కూడా మంచి ఆసక్తి ఉంది. తాజాగా విడుదలైనా టీజర్, అజ్ఞాతవాసి పాటలు కూడా ఆ విషయాన్ని ప్రూవ్ చేశాయి. అంతేకాదు సినిమా విడుదలయ్యే జనవరి 10 వరకు సోషల్ మీడియాలో అజ్ఞాతవాసి సినిమాకి సంబందించిన విషయాలే టాప్ ట్రేండింగ్ లో ఉండడం ఖాయంగా కనబడుతుంది.

ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏమిటి అంటే.. అన్ని విషయాల్లోనూ టాప్ లోనే వుంది. అన్ని విషయాల్లోనూ ముందున్న అజ్ఞాతవాసి విషయంలో ఒక సీక్రెట్ బయటికి వచ్చింది. అదేమిటంటే... త్రివిక్రమ్ నుండి వచ్చే సినిమాలు కాస్త లెంగ్తీగానే ఉంటాయి. అయితే ఇప్పుడు అజ్ఞతవాసి చిత్రం కూడా ముందుగా అనుకున్నదాని కంటే ఎక్కువే రన్ టైం వచ్చిందట. అయితే దీనికి కారణం ఆఖరి నిమిషంలో త్రివిక్రమ్ చేసిన వాల్యూ ఎడిషన్స్ వలన రన్ టైం పెరిగిందనే టాక్ వినబడుతుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో త్రివిక్రమ్ ఎమోషన్స్ పండించడంపై బాగా శ్రద్ధ పెట్టారట. సినిమా పర్ఫెక్ట్ గా వచ్చినా.. ఇంత సుదీర్ఘమైన డ్యురేషన్ అంటే.. ఎగ్జిబిటర్లకు ఇబ్బంది.  ఎందుకంటే వాళ్ళు ఈ రన్ టైం ఎక్కువవడం వలన ఎక్కువ షోలు వేసుకునేందుకు అడ్డం అవుతుంది.

కానీ రన్ టైం ని తగ్గించే విషయంలో త్రివిక్రమ్ అస్సలు కాంప్రమైజ్ కావడం లేదట. అజ్ఞాతవాసి రన్ టైం  2గంటల 45 నిమిషాల నిడివితోనే ఫైనల్ కట్ ఉంటుందని సమాచారం. మరి ఫైనల్ గా అజ్ఞాతవాసికి ఎంత రన్ టైం ఉంచుతారో అనేది తెలియాల్సి ఉంది.

Gossips on Agnathavasi Movie Run Time :

Trivikram No Compromise on Agnathavasi Run Time

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ