Advertisementt

క్రికెటర్లకు ఉండే క్రేజ్‌కి ఇది నిదర్శనం!

Thu 21st Dec 2017 05:15 PM
sunil gavaskar,poonam kaur,cricket,vizag,cinema,selfie  క్రికెటర్లకు ఉండే క్రేజ్‌కి ఇది నిదర్శనం!
Poonam Kaur Selfie with Sunil Gavaskar క్రికెటర్లకు ఉండే క్రేజ్‌కి ఇది నిదర్శనం!
Advertisement
Ads by CJ

పాతకాలంలో కూడా పలువురు బాలీవుడ్‌ నటీమణులు క్రికెటర్లను పెళ్లి చేసుకున్నవారు ఉన్నారు. మరికొందరు ఎఫైర్లు నడిపారు. ఇక ఇటీవల 'బాహుబలి'తో నేషనల్‌ లెవల్‌లో అదరగొట్టిన శివగామి రమ్యకృష్ణ ఇండియన్‌ క్రికెట్‌ టీం కెప్టెన్‌ విరాట్‌కోహ్లితో కలిసి ఫొటో దిగింది. ఇక నాడు సుమలత, జయసుధ వంటి వారికి కపిల్‌దేవ్‌ అంటే వీరాభిమానం. ఇక నేటి వారిలో కూడా ధోని, రాహుల్‌ద్రవిడ్‌ వంటి వారికి ఎంతో క్రేజ్‌ ఉంది. నగ్మా.. సౌరవ్‌గంగూలీతో, రాయ్‌లక్ష్మి.. మహేంద్రసింగ్‌ ధోనిలతో ఎఫైర్లు నడిపారనే వార్తలు వినే ఉన్నాం. కోహ్లి తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్కశర్మని వివాహం చేసుకున్నాడు. ఇక క్రికెటర్‌ శ్రీశాంత్‌ బయోపిక్‌లో శ్రీశాంత్‌ తల్లి పాత్రకు రమ్యకృష్ణ ఒప్పుకుంది. 

తాజాగా టాలీవుడ్‌ నటి పూనమ్‌కౌర్‌ క్రికెట్‌ దిగ్గజ ఆటగాడు సునీల్‌ గవాస్కర్‌ని చూసి ఆనందం తట్టుకోలేకపోయింది. తాజాగా వైజాగ్‌లో ఇండియా-శ్రీలంక జట్ల మధ్య వన్డే మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కి పూనమ్‌కౌర్‌ కూడా చూసేందుకు వెళ్లింది. మరోవైపు ఈ మ్యాచ్‌కి వ్యాఖ్యాతగా సన్ని ఉన్నాడు. దాంతో పూనమ్‌కౌర్‌ సన్నిని చూసిన ఆనందంలో ఎలాగైనా ఆయన్ను కలవాలని భావించి నిర్వాహకుల అనుమతితో కామెంటరీ బాక్స్‌లోకి వెళ్లి లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌తో కాసేపు మాట్లాడి ఓ సెల్ఫీ తీసుకుంది. దానిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. 

ఈ సందర్భంగా ఆమె.. 'నాకు సన్ని అంటే ఎంతో గౌరవం. ఎంతో ఉన్నత వ్యక్తి ఆయన. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నవారు. మనదేశంలో క్రికెట్‌కి ఎందరో అభిమానులు ఉన్నారు. అందులో నేను కూడా ఉన్నాను. సన్ని నా అభిమాన క్రికెటర్లలో ప్రథముడు..' అని తెలిపింది. మొత్తానికి మనదేశంలో కేవలం సినిమా, క్రికెట్‌ తప్ప మరో దానికి చోటు లేదని చెప్పవచ్చేమో...! 

Poonam Kaur Selfie with Sunil Gavaskar:

Sunil Gavaskar is at the top of actor Poonam Kaur's list

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ