అక్కినేని అఖిల్ తన మొదటి చిత్రం 'అఖిల్' డిజాస్టర్ కావడంతో తన కాన్ఫిడెన్స్‌నంతా కోల్పోయానని ఓసారి చెప్పుకొచ్చాడు. దాంతో తన తండ్రికే తన రెండో చిత్రం నిర్మాణ బాధ్యతలతోపాటు కథ, దర్శకత్వం, సాంకేతిక నిపుణులు.. ఇలా అన్ని విషయాలను తన తండ్రి ఇష్టానికే అప్పగించాడు. మొత్తానికి 'హలో' చిత్రం అఖిల్ కెరీర్‌కి ఎంతో కీలకం కానుంది. ఈ చిత్రం కోసం ఆయన ఎంతో కష్టపడ్డాడు. ఇక వైజాగ్‌లో జరిగిన వేడుకలో వేదికపై డ్యాన్స్‌లు చేసి, పాట పాడి అలరించాడు. ఆ తర్వాత యూఎస్‌కి వెళ్లి అక్కడ కూడా పలు చోట్ల ప్రమోషన్ కోసం పర్పార్మెన్స్‌ని అందించాడు.
ఇక ఈ రోజు జరుగనున్న ప్రీరిలీజ్ వేడుకలో కూడా ఆయన హంగామా చేయనున్నాడు. ఈ చిత్రం తమ సొంత బేనర్‌లో, తనతండ్రి నిర్మిస్తున్న చిత్రం కావడంతో 'హలో' చిత్రానికి ఆయన ఇంకా పది పైసలు కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది. ఈ చిత్రం హిట్ అయితే నాగ్.. అఖిల్‌కి పారితోషికం స్థానంలో ఓ భారీ విలువ కలిగిన గిఫ్ట్‌ని రెడీ చేశాడట. మొదటి నుంచి అఖిల్‌కి బైక్‌లన్నా, కార్లన్నా ఎంతో పిచ్చి.
దాంతో 'హలో' చిత్రం హిట్టయితే నాగార్జున తన చిన్నకుమారుడు అఖిల్‌కి రెండు కోట్లు విలువ చేసే ఓ ఖరీదైన గిఫ్ట్‌ని ఇవ్వనున్నాడట. ఇప్పటికే ఈ కారుని కూడా ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం విజయం పట్ల నాగ్, అఖల్‌లు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో చెప్పవచ్చు. మొత్తానికి తండ్రి కారు కొనివ్వాలని భావిస్తున్నా.. ఆ కారు అఖిల్‌కి లభిస్తుందా? లేదా? అని నిర్ణయించాల్సింది మాత్రం ప్రేక్షకదేవుళ్లే అనడంలో సందేహం లేదు.