పవన్‌కళ్యాణ్‌పై కత్తి మహేష్ సెటైర్లు డైలీసీరియల్స్‌ని మరిపించేలా సాగుతూనే ఉన్నాయి. పవన్ పర్యటనతో అటు రాజకీయలబ్దిని, ఇటు తన సినిమా 'అజ్ఞాతవాసి' ప్రమోషన్‌ని కలిపి రెండు చేస్తూ ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే విధంగా వ్యవహరిస్తున్నాడని రెచ్చిగొట్టిన ఆయన పవన్ 'అజ్జాతవాసి' కాదని, ఆయన నోరు విప్పిన ప్రతిసారి 'అజ్ఞానవాసి' అనిపిస్తోందని అభిమానులను మరింత రెచ్చగొట్టాడు. అభిమానులు ఏమైనా తమ హీరోలను అంటే రెచ్చిపోవడం సహజం. అది ఎవ్వరి అభిమానులైనా సరే. అలాంటి పరిస్థితుల్లో కాస్త విమర్శకులు, సెలబ్రిటీలే మౌనం పాటిస్తే తమకున్న మర్యాదను కాపాడుకున్నట్లు అవుతుంది.
ఇక 'అజ్ఞాతవాసి' టీజర్ రిలీజ్ సందర్భంగా కూడా మహేష్‌కత్తి మరోసారి పవన్‌ని టార్గెట్ చేశాడు. ఈసారి ఆయన పవన్‌నే కాకుండా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ని కూడా టార్గెట్ చేయడం విశేషం. ఏ పదానికి ఏమి అర్ధమో.. 'కత్తి'మహేష్ త్రివిక్రమ్‌కి చెప్పడం చూస్తుంటే ఇదేదో తాతయ్యకు దగ్గులు నేర్పినట్లుగా ఉంది. ఒక విధంగా చూసుకుంటే బాలీవుడ్‌కి చెందిన ఆర్ కె.ఖాన్ ఎలాగో ఈ కత్తిమహేష్ కూడా అంతే గొప్ప కుహనా మేధావిగా తనను తాను భావిస్తున్నట్లు ఉన్నాడు. ఆర్.కమలాఖాన్‌లా ఓ చిత్రం తీసి అన్ని పోగొట్టుకుని ఆయన ఫిల్మ్‌క్రిటిక్ అవతారం ఎత్తాడు. ఇక మహేష్ కత్తి తీసిన పెసరట్టు అసలు ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. అలాంటి వ్యక్తి, కేవలం ఓ ప్రధాన పార్టీకి జీతగాడుగా అందరు భావిస్తున్న మహేష్ ముందు పెసరెట్టు వంటి చిత్రాలు తీయడం మానేసి త్రివిక్రమ్ స్థాయిలో ఓ చిత్రం తీస్తేనే ఎవరైనా ఆయన మాటలకు విలువ ఇస్తారు. ఇక ఓ ఆంగ్లదిన పత్రిక పవన్ నటిస్తున్న'అజ్ఞాతవాసి' ఓ హాలీవుడ్ చిత్రానికి కాపీ అని చెప్పింది.
ఇక ఈ చిత్రం తెలుగులో యండమూరి రాసి వెంకటేష్ హీరోగా చేసిన 'ఒంటరిపోరాటం' చిత్రం తరహాలో ఉండనుందనే వార్తలు కూడా వస్తున్నాయి. అయినా కాపీ కొట్టడం వేరు... స్ఫూర్తి చెందడం వేరనే విషయం కత్తికి తెలియకపోవడం దురదృష్టకరం. ఆలెక్కన ప్రతి చిత్ర కథకి వాస్తవసంఘటనలు లేదా మన పురాణాలలోని సంఘటనలే కథా వస్తువులుగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా దుష్టశిక్షణ-శిష్టరక్షణ మీదనే మన సినిమాలు నడుస్తాయి. ఇక మహేష్‌కత్తి చిత్రాన్ని, టీజర్‌ని విమర్శించడంలో తప్పులేదు గానీ ఆయన వ్యక్తిగతంగా పదే పదే పవన్‌ని టార్గెట్ చేయడం మాత్రం సమంజసం కాదు. ఈయన 'లార్గో వించ్'కి సంబంధించిన ట్రైలర్‌ని ట్విట్టర్‌లో పంచుకుని ఎందుకైనా మంచిది.. ఈ చిత్రాన్ని కాస్త గుర్తుపెట్టుకోండి అంటూ పరోక్షంగా త్రివిక్రమ్ ఈ సినిమాని కాపీ కొట్టాడని అర్ధం వచ్చేలా చేసిన ట్వీట్ చేయడం చూస్తే అసలు కత్తిది ఏం పైశాచిక ఆనందమో తెలియడం లేదు....!