వర్మ కాంపౌండ్ నుంచి వచ్చిన నటుడు వివేక్ ఒబేరాయ్. కాగా ఆయన వర్మ తీసిన 'రక్తచరిత్ర' చిత్రంలో పరిటాల రవి పాత్రలో నటించి, అదుర్స్ అనిపించాడు. ఆ తర్వాత ఆయనకు తెలుగులో రెండు మూడు చిత్రాలలో అవకాశాలు వచ్చినా ఆయన నటించలేదు. ఇక చిరంజీవి 150వ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'ఖైదీనెంబర్ 150' చిత్రంలో వివేక్ ఒబేరాయ్‌ని విలన్‌గా తీసుకోవాలని ఎంతగానో ప్రయత్నించారు. కానీ వివేక్ ఆ పాత్రను చేయలేదు. ఇక తాజాగా ఆయన తమిళంలో స్టార్ అజిత్ హీరోగా నటించిన 'వివేగం' చిత్రంలో విలన్ పాత్రని పోషించాడు. ఇక విషయానికి వస్తే రామ్‌చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగస్థలం 1985' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. తన తదుపరి చిత్రంగా రామ్‌చరణ్ బోయపాటిశ్రీను దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం జనవరి చివరి వారంలో గానీ లేదా ఫిబ్రవరి మొదటి వారంలో గానీ రెగ్యూలర్ షూటింగ్‌కి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దసరాకు రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. దానయ్య నిర్మించనున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ పక్కా మాస్, యాక్షన్ హీరోగా చేయనున్నాడట. 'ధృవ, రంగస్థలం 1985' వంటి విభిన్న చిత్రాల తర్వాత రామ్‌చరణ్ మరలా తన పాత మాస్ యాక్షన్ చిత్రంలో నటిస్తుండటం విశేషం. ఇక బోయపాటి శ్రీను చిత్రాలలో హీరోలని ఎంతగా పీక్స్‌లో, హీరోయిజాన్ని ఆకాశాన్ని తాకేలా చూపే బోయపాటి విలన్ల విషయంలో కూడా అదే పంధాని అనుసరిస్తారు. తన చిత్రాలలో హీరోకి సరిపోయే విధంగా హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం కోసం విలన్ పాత్రలను కూడా వయొలెంట్‌గా, పవర్‌ఫుల్‌గా చూపిస్తాడు.
దీంతో ఈ చిత్రంలో రామ్‌చరణ్‌కి ప్రత్యర్ధి పాత్రకు వివేక్ ఒబేరాయ్‌ని తీసుకోనున్నాడని సమాచారం. ఇప్పటికీ జగపతిబాబు, ఆది పినిశెట్టి వంటి వారిని పవర్‌ఫుల్‌గా చూపించిన బోయపాటి ఈ చిత్రంలో వివేక్ ఒబేరాయ్‌తో పాటు రమ్యకృష్ణని కూడా ఓ కీలక పాత్రను ఎంచుకోనున్నాడు. ఇప్పటికే పవన్, బన్నీల సరసన నటిస్తోన్న అనుఇమ్మాన్యుయేల్ ఇందులో హీరోయిన్‌గా ఎంపికైందని వార్తలు వస్తున్నాయి.