Advertisementt

మహేష్ కోసం అల్లరోడికి ఎందుకంత కష్టం?

Wed 20th Dec 2017 01:36 AM
mahesh babu,allari naresh,friend role,new movie  మహేష్ కోసం అల్లరోడికి ఎందుకంత కష్టం?
Sudden Star Changes For Super Star మహేష్ కోసం అల్లరోడికి ఎందుకంత కష్టం?
Advertisement
Ads by CJ

మహేష్ బాబు, కొరటాలశివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కంప్లీట్ కాగానే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు మహేష్ బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో  కామెడీ హీరో అయిన అల్లరి నరేష్ ఒక ముఖ్యపాత్రలో నటించనున్నాడు. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు కంటే కూడా ఎక్కువగా కష్టపడుతున్నాడట అల్లరి నరేష్. 

ఎప్పుడు సన్నగా రివాటుగా కనిపించే నరేష్ తాజాగా ఒక కార్యక్రమంలో కాస్త బొద్దుగా కనిపించడంతో పరిశ్రమలో అది హాట్ టాపిక్ గా మారింది. మహేష్ బాబు కోసం అల్లరి నరేష్ ఇలా బొద్దుగా తయారవుతున్నాడని ఫిలిం నగర్ లో టాక్ వినబడుతుంది. ఇదిలా ఉంటే వంశీ పైడిపల్లి మూవీలో మహేష్ బాబు ఫ్రెండ్ రోల్ లో అల్లరి నరేష్ నటించబోతున్నాడనే ప్రచారము ఉంది . అందుకే ఈ ఫ్రెండ్ పాత్ర కోసం అల్లరి నరేష్ లావు అవుతున్నాడని ఫిలిం నగర్ టాక్. దీని కోసమే జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నాడట. అందరు సన్నబడం కోసం జిమ్ లో కష్టపడుతుంటే..  అల్లరి మాత్రం మహేష్ కోసం లావవ్వడానికి జిమ్ లో కష్టపడుతున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరి దీన్ని బట్టి చూస్తుంటే వంశీ సినిమాలో హీరో కంటే కూడా హీరో ఫ్రెండ్ ఎక్కువ కష్టపడుతున్నాడు అని అర్ధం అవుతుంది. ఇకపోతే వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

Sudden Star Changes For Super Star:

Allari Naresh transformation for Mahesh Babu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ