Advertisementt

ఖుష్బూ కుర్చీలో.. 'అజ్ఞాతవాసి' వెనుక..!

Wed 20th Dec 2017 01:30 AM
kushboo,agnathavasi,posters,sensation,social media  ఖుష్బూ కుర్చీలో.. 'అజ్ఞాతవాసి' వెనుక..!
Kushboo Posted Agnathavasi poster ఖుష్బూ కుర్చీలో.. 'అజ్ఞాతవాసి' వెనుక..!
Advertisement
Ads by CJ

పవన్‌ -త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'అజ్ఞాతవాసి' హ్యాట్రిక్‌ చిత్రం కావడం, ఇప్పటికే విడుదలైన పాటలు ఇన్‌స్టెంట్‌గా అందరినీ ఆకట్టుకుంటుండటం తెలిసిందే. ఇక ఈ చిత్రం పవన్‌కి 25వ ప్రతిష్టాత్మక చిత్రం కావడం కూడా విశేషం. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌, టీజర్స్‌ సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ టీజర్‌లో 'అత్తారింటికి దారేది' చిత్రం తరహాలోనే పలు విషయాలు ఉన్నాయి. ఇక ఈ టీజర్‌ ఇప్పుడు నేషనల్‌ వైడ్‌లో ట్రెండింగ్‌ అవుతోంది. ఇప్పటివరకు రిలీజైన పోస్టర్స్‌లో నటి ఖుష్బూ మాత్రం కనిపించలేదు. దాంతో తాజాగా ఆమె తన ట్విట్టర్‌ అకౌంట్‌లో తాను ఉన్న ఓ న్యూ పోస్టర్‌ని విడుదల చేసింది.

ఇందులో ఖుష్బూ కుర్చీలో కూర్చుని ఉండగా, వెనుక వైపు పవన్‌ కళ్యాణ్‌ సీరియస్‌గా చూస్తున్న లుక్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఇలాంటి పవర్‌ఫుల్‌ పాత్రని తనకి ఇచ్చిన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ని మర్చిపోలేనని, ఇక పవన్‌ ఓ అద్భుతమైన వ్యక్తి అని ఆమె ట్వీట్‌ చేసింది. 'అత్తారింటికి దారేది' చిత్రంలో 'దేవ దేవం భజే' కీర్తనను సిట్యూయేషన్‌కి తగ్గట్లుగా చక్కగా వాడుకున్న త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ 'అజ్ఞాతవాసి' టీజర్‌లో కూడా 'మధురాపురి సదనా' కీర్తనను చక్కగా వాడుకున్నాడు.

ఈ కీర్తనను 300ఏళ్ల కిందట శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుడైన తమిళ కవి ఊతుక్కాడ వెంకటకవి రచించిన సంగతి తెలసిందే. దీనికి అనిరుద్‌ వినసొంపైన ట్యూన్‌ని అందించగా, ఈ కీర్తనను విన్నవారు త్రివిక్రమ్‌ని మెచ్చుకుంటూ తమ సాహిత్యాభిలాషని ఆయనకు తెలియజేస్తున్నారు. ఇక ఈ చిత్రం ఆడియో ఈనెల 19న విడుదల కానుండగా, సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన 'బాహుబలి' రేంజ్‌లో విడుదల చేయనుండటంతో అంతటా ఆసక్తి నెలకొని ఉంది.

Kushboo Posted Agnathavasi poster:

Kushboo Agnathavasi Posters Sensation in Social Media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ