ప్రభాస్ పెళ్ళెప్పుడు చేసుకుంటాడా.. అని ఇండస్ట్రీ జనాలతోపాటే.. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభాస్ పెళ్లి గురించి మాత్రం పెదవి విప్పడం లేదు. అప్పుడే 38 వచ్చేసినా పెళ్లి పేరెత్తని ప్రభాస్ కి పెళ్లి పేరు మీద ఎన్నికష్టాలొచ్చాయో తెలుసా..? బాహుబలి తర్వాత జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ఇప్పుడు ప్రస్తుతం సాహో షూటింగ్ లో బిజీగా వున్నాడు. అయితే ప్రభాస్ కున్న ఆ క్రేజ్ ని కాష్ చేసుకోడానికి ఎన్నో ప్రొడక్షన్ కంపెనీలు కూడా ప్రభాస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి.
అయితే ఇప్పుడు ప్రభాస్ కున్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి ఒక బడా మ్యాట్రిమోని సంస్థ ఒక కాన్సెప్ట్ ని రెడీ చేసుకుని ప్రభాస్ కు ప్రభాస్ దగ్గరకెళ్ళిందట. అయితే మ్యాట్రిమోని వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ ప్రభాస్ పెళ్లి విషయమై ముడిపడి ఉండటంతో... 15 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పినప్పటికీ ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేశాడట ప్రభాస్. మరి కేవలం ఓ యాడ్ లో నటిస్తే 15 కోట్లు ఇవ్వడం అనేది చాలా ఎక్కువ. కానీ ప్రభాస్ మాత్రం ఆ ఆఫర్ ని వద్దనుకున్నాడట. ఇంతకీ వాళ్ళు చెప్పిన ఆ పెళ్ళికి సంబందించిన కాన్సెప్ట్ ఏంటి అంటే.... ప్రభాస్ రాజదర్బార్ లో రాజసంగా నడుచుకుంటూ వస్తుంటే అతడ్ని వరించే వాళ్ళు ఎంతో ఉత్సుకతతో పోటీ పడుతుంటారు.
అయితే ఇలాంటి పెళ్లికాని ఆజానుబాహుడు కావాలంటే మా మ్యాట్రిమోనిని మాత్రమే సంప్రదించండి అంటూ యాడ్ షూట్ చేస్తారట. అక్కడే ప్రభాస్ కు ఆ కాన్సెప్ట్ నచ్చలేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రభాస్ పెళ్లి విషయమై ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పెళ్లి కాని వాళ్ళ లిస్ట్ లో మొదటి పేరు ప్రభాస్ దే. అందుకే ఈ పెళ్లి కాన్సెప్ట్ నచ్చకే ప్రభాస్ ఆ 15 కోట్ల డీల్ ని క్యాన్సిల్ చేసుకున్నాడన్నమాట.