ప్రతి ఏడాది క్రిస్మస్ ని హైదరాబాద్ లో సినిమా సెలబ్రిటీస్ బాగా జరుపుకుంటారు. గత నెల రోజులు నుండి ఈ పండుగ హడావిడి జరుగుతుంది. కేక్ మిక్సింగ్ లో సినీ తారలు పాల్గొని సందడి చేస్తున్నారు. టాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీస్ ఈ క్రిస్మస్ పండుగను బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అందులో ముఖ్యంగా అక్కినేని అమల ప్రతి ఏటా ఈ పండుగను ఎంతో ఘనంగా ఫ్యామిలీతో జరుపుకుంటది.
అయితే అదే రోజు అక్కినేని కొత్తకోడలు సమంత కూడా ఈ పండగను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవటానికి రెడీ అయిందంట. కానీ ఇక్కడ నాగార్జునకి ఓ చిక్కు వచ్చి పడింది. అదేటంటే.. ఈ రెండు పార్టీస్ కి నాగ్ కచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఆ రెండు పార్టీలలో దేనికి వెళ్లాలో అర్థం కావడం లేదని - కన్ఫ్యూజింగ్ గా ఉందని నాగ్ స్వయంగా అన్నాడు.
ఎటు వెళ్లాలో కన్ఫ్యూజింగ్ స్టేటస్ లో నాగ్ వున్నాడట. కోడలా? పెళ్లామా? అనే ఇరకాటంలో ఉన్న నాగ్ ఏ పార్టీకి అటెండ్ అవుతాడో అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. కానీ ఇక్కడ ఇంకోటి వుంది క్రిస్మస్ కి ముందు హలో సినిమా రిలీజ్ అవుతుంది. హిట్ అయితే ఆ పార్టీస్ ఎంజాయ్ చేయొచ్చు.. కానీ సినిమా టాక్ వేరేలా ఉంటే మరి నాగ్ ఈ రెండు పార్టీస్ కి డుమ్మా కొట్టే అవకాశంవుంది.