Advertisementt

విజయ్ దేవరకొండ ఆ ప్రాజెక్ట్ వదిలేశాడంట!

Tue 19th Dec 2017 12:20 AM
vijay devarakonda,bollywood,big project,yash raj banner,drop  విజయ్ దేవరకొండ ఆ ప్రాజెక్ట్ వదిలేశాడంట!
Vijay Devarakonda Drops Yash Raj Films Movie విజయ్ దేవరకొండ ఆ ప్రాజెక్ట్ వదిలేశాడంట!
Advertisement
Ads by CJ

ఎప్పటికప్పుడు చెబుతున్న మాటే అయినా.. అర్జున్ రెడ్డి మూవీతో స్టార్ హీరో స్టేటస్ ని అందుకొని కెరీర్ లో మంచి ఊపు మీద ఉన్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సంచలన విజయం సాధించడంతో విజయ్ దేవరకొండ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. అర్జున్ రెడ్డితో వచ్చిన యాటిట్యూడ్ ని కూడా వదులుకోవడానికి ఇష్టపడడం లేదు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి విజయంతో విజయ్ కి అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. పెద్ద ఎత్తున అవకాశాలు వస్తుండటంతో విజయ్ అసలు ఏ ఆఫర్ ని ఎంచుకోవాలా అని ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.

తెలుగులో బడా నిర్మాణ సంస్థల ఆధ్వర్యంలో సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు ఒక్క ఆఫర్ ని వదులుకున్నాడనే టాక్ ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే బాలీవుడ్ లో దిగ్గజ నిర్మాణ సంస్థ అయిన యశ్ రాజ్ ఫిలిమ్స్ విజయ్ దేవరకొండతో సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చారు. అయితే ఆ నిర్మాణ సంస్థ వారు విజయ్ దేవరకొండని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు వరుసగా చెయ్యాలని... కాని అదే టైం లో వేరే సినిమాలు చేయొద్దని కండీషన్ కూడా పెట్టారట వారు. మరి విజయ్ అలా చెయ్యలేక యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళ ఆఫర్ ని రిజెక్ట్ చేశాడట.

మరి బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఇచ్చియాన్ అద్భుతమైన ఆఫర్ ని అలా విజయ్ రిజెక్ట్ చేయడం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యి కూర్చుంది. అసలు అంత పెద్ద బ్యానర్ నుంచి ఛాన్స్ వస్తే విజయ్ ఎలా వదులుకుంటాడు అని గుసగుసలు ఆడుకుంటున్నారు అంతా. కానీ విజయ్ దేవరకొండ మాత్రం తెలుగు అవకాశాలని మిస్ చేసుకోకూడదని ఉద్దేశంతో ఇలా బాలీవుడ్ ఆఫర్ ని వదులుకున్నాడనే టాక్ వినబడుతుంది.

Vijay Devarakonda Drops Yash Raj Films Movie:

Vijay Devarakonda Dropped Big Project from Bollywood Banner

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ